Khammam Victim | నా భర్త చనిపోయాడు, ఇద్దరమ్మాయిలు.. ఎక్కడికెళ్లాలో అర్థం కావట్లేదు : వెలుగుమట్ల బాధిత మహిళ
Khammam Victim | పేదలు ఎన్నో కష్టాలు పడి కట్టుకున్నఇళ్లను కూల్చివేస్తూ నిలువ నీడ లేకుండా చేసిన బాధితులను రోడ్డున పడేస్తూ వారిని కన్నీరుమున్నీరయ్యేలా చేస్తోంది. ఓ వితంతు మహిళ తన ఇల్లు కూల్చడంతో ఏం చేయాలో తోచడం లేదంటూ కన్నీటిపర్యంతమైంది.
Khammam Victim | కాంగ్రెస్ సర్కార్ కనికరం లేకుండా పేదల ఇళ్లను నేలమట్టం చేస్తోంది. సర్కారు బుల్డోజర్ల ధాటికి పేదల ఇళ్లు కుప్పకూలిపోతున్నాయి. రేవంత్ ప్రభుత్వం ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు ఎన్నో కష్టాలు పడి కట్టుకున్నఇళ్లను కూల్చివేస్తూ నిలువ నీడ లేకుండా చేసిన బాధితులను రోడ్డున పడేస్తూ వారిని కన్నీరుమున్నీరయ్యేలా చేస్తోంది. ఓ వితంతు మహిళ తన ఇల్లు కూల్చడంతో ఏం చేయాలో తోచడం లేదంటూ కన్నీటిపర్యంతమైంది.
నాకు ఇద్దరమ్మాయిలు.. వస్తువులు తీసుకోవడానికి కూడా మాకు రూపాయి లేవు.. సామాన్లన్ని అట్లనే పడున్నయ్. అందరూ వచ్చి చూసుకొని వెళ్తున్నరు కానీ ఎవరైనా సాయం కూడా చేయడం లేదు. ఎక్కడికెళ్లాలో అర్థం కావట్లేదు. మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. సంవత్సరం అయింది.. ఏం చేయాలో తెలియడం లేదు.. రెంట్ తీసుకుందామంటే ఐదారు వేలు చెబుతున్నరు. నా దగ్గరేమో చాతకాదు. మా అత్తమ్మ.. ఇద్దరమ్మాయిలు.. ముగ్గురినీ ఒక్కదాన్నే వాళ్లను సాదాలి. నేను రెంట్ కట్టాల్నా.. వాళ్లను సాదాల్నా ఏం అర్థం కావట్లేదు సారూ.. అంటూ కన్నీటి పర్యంతమైంది.
అసలు ఇలాంటి పరిస్థితులు వస్తయనుకుంటే రెంట్ కట్టుకుని ఉండేవాళ్లం. ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత బాధపడుకుంటా..ఇంత దూరం నడిచి 100 రూపాయలు ఛార్జి పెట్టుకొని.. అదే చార్జి పెట్టుకుంటే అక్కడ రెంట్కైనా ఉండేవాళ్లం. ఇద్దరమ్మాయిలు కదా అని ఎప్పటికైనా సొంతం ఉంటది కదా అని ఆశ పడి వచ్చినం సారూ.. వచ్చినందుకు మమ్మల్ని ఇంత అన్యాయం చేశారు. మేమేం చేయాలి. ప్రభుత్వం, ఇక్కడున్నోళ్లు మాకు అన్యాయం చేసిర్రు. ఎవరూ మాకు న్యాయం చేయలేదంటూ ఆవేదన వెల్లగక్కారు.
ముగ్గురు మంత్రులు కనీసం ఒక్కరన్నా రాలేదు.. మమ్మల్ని కూడా కలవనివ్వడంలేదు. వాళ్లవాళ్లని కలిసి వెళ్లిపోతున్నరు. పేదలను కలిసి మాకు ఓట్లేయండమ్మా మీకేమన్నా సాయం చేస్తమని మమ్మల్ని కలిసుంటే మేం కాళ్లు పట్టుకుని మేం అడిగేటోళ్లం.. నిన్నటి నుండి అన్నం, నీళ్లు లేకుండా చెట్టు కిందనే ఉన్నాం అంటూ చెప్పుకొచ్చింది.
నా భర్త చనిపోయాడు.. నాకు ఇద్దరు ఆడపిల్లలు, నాకు కిరాయి కట్టే స్థోమత కూడా లేదు
ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో మాకు అర్థం కావడం లేదు
ముగ్గురు మంత్రులు ఉంటే మమ్మల్ని కలవలేదు, మమ్మల్ని కూడా కలవనివ్వడంలేదు
నిన్నటి నుండి అన్నం, నీళ్లు లేకుండా చెట్టు కిందనే ఉన్నాము
ఖమ్మం కలెక్టరేట్… https://t.co/9ousWyAWwW pic.twitter.com/CcoCtxoJ2A
— Telugu Scribe (@TeluguScribe) February 26, 2026
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

