S-400 Missile System: ఆపరేషన్ సింధూర్‌లో ఎస్-400 ఫైరింగ్.. వీడియో రిలీజ్ చేసిన ఐఏఎఫ్
S-400 Missile System: రాజస్థాన్‌లో శుక్రవారం నుంచి వాయు శక్తి విన్యాసాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్‌కు చెందిన ఫైరింగ్ వీడియోను ఇవాళ భారతీయ వైమానిక దళం రిలీజ్ చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ క్షిపణి వ్యవస్థ.. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్(S-400 Missile System)కు చెందిన లైవ్ యాక్షన్ వీడియోను ఇవాళ భారతీయ వైమానిక దళం రిలీజ్ చేసింది. గత ఏడాది పాకిస్థాన్‌తో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎస్-400 మిస్సైల్ వ్యవస్థ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే తొలిసారి ఈ క్షిపణి ఫైరింగ్‌కు చెందిన వీడియోను రిలీజ్ చేస్తున్నట్లు ఐఏఎఫ్ పేర్కొన్నది. సైనిక చరిత్రలోనే ఈ మిస్సైల్ వ్యవస్థ ఓ రికార్డును స్థాపించినట్లు పేర్కొన్నది. చాలా దూరం నుంచి గగనతలంలోనే విమానాన్ని షూట్ చేసినట్లు ఐఏఎఫ్ తన వీడియో ద్వారా వెల్లడించింది.
రష్యా తయారీకి చెందిన ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్.. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానాన్ని నేలకూల్చింది. సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ఎస్-400 క్షిపణి కూల్చినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ భూభాగంలో ఆ విమానాన్ని కూల్చివేసినట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఆ ఘటనకు చెందిన రేడార్ దృశ్యాలను ఈ వీడియో ద్వారా రిలీజ్ చేశారు. శత్రువు చాలా దూరం ఉండవచ్చు.. కానీ కంటికి చిక్కకుండా ఉండలేడన్న టైటిల్‌తో వైమానిక దళం ఈ వీడియోను రిలీజ్ చేసింది.
ఓ జెట్ సమీపిస్తున్న దృశ్యాలను రేడార్ ఇమేజ్ గుర్తిస్తున్నట్లు ఈ వీడియోలో ఉన్నది. ఆ తర్వాత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ యాక్టివేట్ అయినట్లు ఆ వీడియోలో చూపించారు. వాస్తవానికి ఈ వీడియోలో ఉన్నది ఆపరేషన్ సింధూర్‌కు చెందిన ఒరిజినల్ మిస్సైల్ ఫూటేజ్ కాదు అని, కానీ వాయు శక్తి విన్యాసాల ప్రమోషన్ కోసం ఈ వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని పోక్రాన్‌లో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి వాయు శక్తి విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన డజన్ విమానాలను కూల్చినట్లు గత అక్టోబర్‌లో ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ టార్గెట్‌ను కూల్చిన విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేశారు. బహుశా అది పీఏఎఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ విమానం అయి ఉంటుందని, దాంతో పాటు ఎఫ్-16, జే-17 యుద్ధ విమానాల్లో కొన్ని ఉంటాయని తమ సిస్టమ్ అంచనా వేసినట్లు ఆయన చెప్పారు. మన సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్‌తో పాక్ భూభాగంలో కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్లు ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.
Indian Air Force: Infallible, Impervious and Precise
1 day to go.
The Indian Air Force has successfully validated all operational parameters during the Full Dress Rehearsal for #Vayushakti26 at Pokhran, all targets effectively neutralised.
All Air Warriors now stand fully… pic.twitter.com/j7ZWmOYYb1
— Indian Air Force (@IAF_MCC) February 26, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
మంచిర్యాలను కమ్మేసిన పొగమంచు.. తెల్లవారుజామున కనువిందు చేసిన ప్రకృతి అందాలు!
Parliament Session | కొనసాగింపా..శీతాకాలమా.. 100 రోజులు పూర్తయినా ప్రొరోగ్ కాని ఉభయ సభలు?
Delimitation Bill | ఒక్కో ఎంపీకి రూ.150 కోట్ల ఆఫర్.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ప్రలోభాలు: సంజయ్ రౌత్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

