Actress Ranya Rao | బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు బిగుస్తున్న ఉచ్చు.. ఈడీ చార్జిషీట్లో ఆమె పేరు..!
Actress Ranya Rao | అక్రమంగా బంగారం తరలించిన కేసులో అరెస్టయిన కన్నడ నటి (Kannada Actress) రన్యారావు (Ranya Rao) మరిన్ని చిక్కుల్లో పడింది. మొత్తం రూ.102 కోట్ల బంగారం స్మగ్లింగ్ (Gold Smuggling) కేసులో ఆమెపై ఆరోపణలు రాగా తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఆమె పేరు కూడా ఉంది.
Actress Ranya Rao : అక్రమంగా బంగారం తరలించిన కేసులో అరెస్టయిన కన్నడ నటి (Kannada Actress) రన్యారావు (Ranya Rao) మరిన్ని చిక్కుల్లో పడింది. మొత్తం రూ.102 కోట్ల బంగారం స్మగ్లింగ్ (Gold Smuggling) కేసులో ఆమెపై ఆరోపణలు రాగా తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఆమె పేరు కూడా ఉంది. స్మగ్లింగ్ సిండికేట్ ఒక ఏడాదిలో 127 కిలోల బంగారాన్ని భారత్కు స్మగ్లింగ్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. తమ హ్యాండ్లర్లు, ఆభరణాల వ్యాపారులు దానిని దేశీయ మార్కెట్లోకి చొప్పించారని ఈడీ దర్యాప్తులో గుర్తించింది.
దాంతో బెంగళూరులోని పీఎంఎల్ఏ కోర్టులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దానిలో రన్యారావు పేరుతోపాటు ఆమె సహాయకుడిగా భావిస్తోన్న తరుణ్ కొండూరు, బళ్లారికి చెందిన గోల్డ్ డీలర్ సాహిల్ జైన్ పేర్లను చేర్చింది. దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ రన్యారావు గత ఏడాది బెంగళూరు విమానాశ్రయంలో దొరికిపోయాడు. ఆమె నుంచి 14.7 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాలో కొన్నేళ్లుగా ఆమె ప్రధానపాత్ర పోషించినట్లు దర్యాప్తులో భాగంగా అధికారులు గుర్తించారు. స్మగ్లింగ్ నెట్వర్క్తో కలిసి పనిచేసిందని వెల్లడించారు.
దుబాయ్ నుంచి బెంగళూరుకు బంగారం అక్రమ రవాణా చేసేందుకు రన్యారావు భారీ మొత్తంలో కమిషన్ తీసుకునేదని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఆమెకు ఏడాది జైలుశిక్ష పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

