Uttar Pradesh | అనలాగ్ డెయిరీ ఉత్పత్తులపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధం.. నెయ్యి, ఖోవాలతోపాటు అన్నింటిపై బ్యాన్
Uttar Pradesh : అనారోగ్యకరమైన అనలాగ్ డెయిరీ ఉత్పత్తులు అన్నింటిపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు యూపీ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం నెయ్యి, పనీర్, ఖోవాతోపాటు అన్ని రకాల అనలాగ్ డెయిర్ ఉత్పత్తుల్ని రాష్ట్రంలో నిషేధం విధించారు.
Uttar Pradesh : అనారోగ్యకరమైన అనలాగ్ డెయిరీ ఉత్పత్తులు అన్నింటిపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు యూపీ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం నెయ్యి, పనీర్, ఖోవాతోపాటు అన్ని రకాల అనలాగ్ డెయిర్ ఉత్పత్తుల్ని రాష్ట్రంలో నిషేధం విధించారు. ఇకపై పాలతో తయారయ్యే సహజసిద్ధమైన ఉత్పత్తుల్ని మాత్రమే రాష్ట్రంలో విక్రయించాలి. లేదంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 ప్రకారం కఠిన చట్టాలు తీసుకుంటారు. ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎస్డీఏ) అధికారులు సోదాలు చేసి, చర్యలు తీసుకుంటారు. ఇంతకుముందే ఇలాంటి వాటిపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
పలు హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేశారు. తప్పుడు లేబుల్స్ కలిగిన ఉత్పత్తులు కలిగి ఉన్న హోటళ్లపై చర్యలు తీసుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ నిర్ణయం పూర్తి స్థాయిలో అమలు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాలు అనలాగ్ డెయిరీ ఉత్పత్తులపై నిషేధం విధించాయి. ఇప్పుడు ఈ జాబితాలో యూపీ కూడా చేరింది. సాధారణంగా పనీర్, నెయ్యి, వెన్న, ఖోవాలాంటి పదార్థాలు జంతువుల నుంచి సేకరించిన పాలతో తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యకరం. కానీ, వీటినే రసాయనాలు ఉపయోగించి కూడా చేయవచ్చు. సోయాబీన్ ఉత్పత్తులు, హానికర రసాయనాలు, టాల్కం పౌడర్, డిటర్జెంట్స్, టైటానియం ఆక్సైడ్, లిక్విడ్ గ్లూకోజ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇతర న్యూట్రలైజర్స్ వంటివి ఉపయోగించి కూడా తయారు చేయవచ్చు.
ఇలా తయారైన వాటినే అనలాగ్ డెయిరీ ప్రొడక్ట్స్ అంటారు. ఇవి చాలా హానికరం. దీర్ఘకాలికంగా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా, అనలాగ్ డెయిరీ ఉత్పత్తుల్ని ప్రభుత్వాలు నిషేధిస్తున్నాయి. అనలాగ్ డెయిరీ ఉత్పత్తుల్ని యూపీ ప్రభుత్వం జారీచేసిన నోటీసులోని కీలక అంశాలివి. అనలాగ్ ఉత్పత్తుల తయారీదారులు, విక్రేతల వద్ద ఈ తరహా ఉత్పత్తులు కనిపించినా వాటిని స్థానిక అధికారులు గుర్తించి సీజ్ చేసి, నాశనం చేయాలి. కెమికల్స్ వాడుతూ సిద్ధం చేస్తున్న ఈ తరహా ఉత్పత్తుల తయారీని వెంటనే ఆపేయాలి. అత్యవసరంగా వీటిపై నిషేధం అమలవుతుంది.
ప్రజలకు అందిస్తున్న ఏదైనా ఉత్పత్తిలో హానికర రసాయనాలు ఉంటే సంబంధిత వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బీఎన్ఎస్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటారు. నిషేధిత డెయిరీ ఉత్పత్తుల్ని విక్రయించడం కూడా నేరమే. లైసెన్స్ కలిగిన సంస్థలు ఏవైనా నిషేధిత ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే వాటి లైసెన్సులు రద్దు చేస్తారు. ఒకవేళ ఇతర రాష్ట్రాల్లో తయారైన వాటిని కూడా రాష్ట్రంలో విక్రయించడానికి, వినియోగించడానికి వీల్లేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- analogue dairy
- ghee
- khoya
- paneer
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

