Cyclist Died : సైకిల్ ట్రాక్‌పై జరిగిన ప్రమాదం ఓ యువ సైక్లిస్ట్‌ను బలిగొన్నది. ఈ విషాదకరమైన ఘటనలో బ్రిటన్‌కు చెందిన 19 ఏళ్ల ఫిన్లే టార్లింగ్ (Finlay Tarling) దుర్మరణం చెందాడు. వొల్టా ఏ పోర్చుగల్ ఈవెంట్లో ఎనిమిదో దశలో ఫిన్లే ఉండగా.. హఠాత్తుగా ఓ వాహనం ట్రాక్ మీదకు దూసుకొచ్చింది. వ్యతిరేక దిశలో వచ్చిన ఆ ట్రక్ సైక్లిస్ట్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్రమైన గాయాలతో అతడు మరణించాడు. ప్రతిభావంతుడైన ఫిన్లే మృతిపట్ల ప్రపంచవ్యాప్తంగా సైక్లిస్ట్‌లు సంతాపం ప్రకటించారు.
చిన్న వయసులోనే టైమ్ ట్రయల్స్‌లో ఆరితేరిన ఫిన్లే టార్లింగ్ సైకిల్ ట్రాక్ మీదే ప్రాణాలు వదిలాడు. వొల్టా ఏ పోర్చుగల్ ఎనిమిదో దశలో ఉండగా.. అతడిని ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో అతడు మరణించాడు. దాంతో, నిర్వాహకులు వెంటనే పోటీని నిలిపివేశారు. సైక్లింగ్‌లో ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న ఫిన్లే మృతితో ప్రపంచంలోని సైక్లిస్ట్‌లు విచారం వ్యక్తం చేశారు.
🇬🇧🇵🇹 A British cyclist Finlay Tarling, 19, has died after colliding with an oncoming van during a race in Portugal.
The NSN Development Team rider was racing between Melgaço and Fafe when he collided with the vehicle, which was not part of the race convoy.
He suffered… pic.twitter.com/OGRtA2anBf
— Europa.com (@europa) August 15, 2026
‘ఈరోజు వొల్టా పోర్చుగల్‌లో ఫిన్లే టారింగ్ మరణించాడనే విషయాన్ని బద్ధలైన హృదయంతో మీకు తెలియజేస్తున్నాం. మా టీమ్‌లోని ప్రియమైన సభ్యుడు ఫిన్. ముఖ్యంగా అతడు చాలామందికి బిడ్డలాంటివాడు. సోదరుడే కాదు పలువురికి అతడు స్నేహితుడితో సమానం. అతడిని మేమెంతో మిస్సవుతాం’ అని ఫిన్లే ప్రతినిధ్యం వహిస్తున్న ఎన్ఎస్ఎన్ డెవలప్మెంట్ టీమ్ వెల్లడించింది. ఫిన్లే ఈ లోకాన్ని వదిలి వెళ్లడం పట్ల టోర్నీ నిర్వాహకులు, పోర్చ్‌గీస్ సైక్లింగ్ సమాఖ్య అతడి కుటుంబసభ్యులకు ప్రగాఢమైన సానుభూతి తెలియజేశారు.
British cyclist Finlay Tarling, 19, has died in a crash during the eighth stage of the Tour of Portugal, race organisers and his NSN Development Team said.
🔗 : https://t.co/ht6PNy8iU5 pic.twitter.com/veEfV0FD78
— AJE Sport (@AJE_Sport) August 14, 2026