Putin | భారతదేశం ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుంది.. స్వాతంత్ర్య వేడుకల వేళ రష్యా అధ్యక్షుడి ప్రశంసలు
Putin | భారత్ (India) సాధిస్తున్న ప్రగతిని రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ (Vlodimir Putin) ప్రశంసించారు. ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ అద్భుతమైన విజయాలు సాధిస్తోందని అన్నారు. ప్రపంచ వేదికపై భారత్ తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు.
Putin : భారత్ (India) సాధిస్తున్న ప్రగతిని రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ (Vlodimir Putin) ప్రశంసించారు. ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ అద్భుతమైన విజయాలు సాధిస్తోందని అన్నారు. ప్రపంచ వేదికపై భారత్ తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం (India’s 80th Independence day) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు.
భారత్, రష్యా దేశాల మధ్య సంబంధాలు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాయని పుతిన్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి, ఎస్సీఓ, బ్రిక్స్ వంటి అంతర్జాతీయ వేదికల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ భద్రత, స్థిరత్వానికి కూడా ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని అన్నారు.
భారత అభివృద్ధి ప్రయాణానికి రష్యా అండగా ఉంటుందని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ముందుకు సాగుతున్న తీరును చూస్తే ప్రజల కలలన్నీ నెరవేరుతాయనే నమ్మకం ఉందన్నారు. రష్యా మద్దతు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని స్పష్టంచేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రష్యా వ్యోమగాములు ప్యోటర్ దుబ్రోవ్, అన్నా కికీనా, ఆండ్రే ఫెద్యాయెవ్ కూడా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

