సుబేదారి : వరంగల్ తూర్పు నియోజకవర్గ పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్దమైంది. ఈమేరకు పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం చార్జీ మెమెలు జారీచేశారు. వారం క్రితం వరంగల్ సబ్ డివిజన్ ఏసీపీ నందిరామ్ నాయక్, మిల్స్ కాలనీ, మట్టెవాడ, ఇంతేజార్ గంజ్, వరంగల్ ట్రాపిక్ ఇన్స్పెక్టర్లు, ఎస్ ఐలు నిబంధనలకు విరుద్ధంగా ప్రొటోకాల్ లేని కొండా మురళీధర్ రావుకు ఎస్కార్ట్ గా వెళ్లారు.
దీనిపై నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనం పై సీపీ విచారణ జరిపించి నాలుగు రోజుల క్రితం సదరు పోలీసు అధికారులకు రెండు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని మెమెలు జారీచేశారు. వారు బుధవారం లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వడంతో సంతృప్తి చెందని సిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవడానికి బుధవారం సాయత్రం ఆయా పోలీసు అధికారులకు చార్జీ మెమెలు జారీచేశారు.