వీర్నపల్లి , జాలై19 : వీర్నపల్లి మండలంలోని అడవిపదిర గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్డం వాగుపై రూ.2.50 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆనంతరం కాంట్రాక్ట్ దక్కించుకున్న గుత్తేదారు పనులు మొదలు పెట్టి పిల్లర్ల వరకు పూర్తి చేశారు. వంతెన పక్కన ఓ రైతుకు చెందిన వ్యవసాయ పొలం నుంచి తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు.
దీంతో చేసిన పనులకు బిల్లులు రాలేవని గుత్తేదారు పనులు నిలిపివేశాడు. సదరు రైతు జేసీబీతో వాగులోని మట్టిని తవ్వించి రోడ్డును మూసివేశాడు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ద్విచక్ర వాహనాలు కూడా వెల్లలేని పరిస్థితి ఉండడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ ముక్తార్ పాషా పరిశీలించారు.