BCCI | భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ.. ఐసీసీ చెప్పినట్టే వింటామని బీసీసీఐ వెల్లడి..!
BCCI : పొట్టి ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇండో-పాక్ మ్యాచ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తమ నిర్ణయాన్ని వెల్లడించింది.
BCCI : పొట్టి ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించడంతో ఫిబ్రవరి 15న హై ఓల్టేట్ మ్యాచ్ ఉంటుందా? ఉండదా? అని కోట్లాది మంది చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పాక్ బోర్డుకు శ్రీలంక క్రికెట్ ఈమెయిల్ పంపగా.. ఐసీసీ ప్రతినిధి సైతం మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండో-పాక్ మ్యాచ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తమ నిర్ణయాన్ని వెల్లడించింది.
ఐసీసీ, ఆసియా క్రికెట్ మండలి ఈవెంట్లలోనే తలపడుతున్న భారత్, పాకిస్థాన్ జట్లు టీ20 వరల్డ్‌కప్‌లో ఢీకొనడంపై అనిశ్చితి కొనసాగుతోంది. మూడు డిమాండ్లకు అంగీకరిస్తేనే ఇండియాతో ఆడుతామని ఐసీసీకి పాక్ బోర్డు స్పష్టం చేసినందున.. ఐసీసీ నిర్ణయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో బీసీసీఐ మాత్రం స్పష్టతతో ఉంది. ఫిబ్రవరి 15న భారత జట్టు కొలంబో వెళ్తుందని ఇదివరకే ప్రకటించిన బీసీసీఐ.. తాజా పరిణామాలపై స్పందించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోమవారం మాట్లాడుతూ తాము ఐసీసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నాడు.
#WATCH | Delhi | On Pakistan to boycott its match against India in the ICC Men’s T20 World Cup 2026, BCCI Vice-President Rajeev Shukla says, “We will follow whatever decision is taken by ICC… BCCI has no statement on this…” pic.twitter.com/gug8zToSic
— ANI (@ANI) February 9, 2026
‘లీగ్ దశలో ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన దాయాదుల మ్యాచ్‌పై నేను ఇదివరకే స్పందించాను. ఐసీసీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మేము నడుచుకుంటాం. ఈ విషయంలో బీసీసీఐ చెప్పాల్సింది, చేయాల్సిందేమీ లేదు’ అని పార్లమెంట్ ప్రాంగణంలో రాజీవ్ శుక్లా మీడియాతో తెలిపాడు. బాయ్‌కాట్ వార్తలపై ఇటీవలే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం మీడియా సమావేశంలో మాట్లాడాడు. ‘ఫిబ్రవరి 15న కొలంబో వెళ్తున్నాం. ఆ రోజుకు ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. మ్యాచ్ ఆడమని వారే(పాక్ బోర్డు) అన్నారు. మేము ఆడేందుకు సిద్దంగా ఉన్నాం’ అని సూర్య వెల్లడించాడు.
అంతకుముందు సైకియా స్పందిస్తూ.. ‘లీగ్ దశ మ్యాచ్ కోసం ఫిబ్రవరి 15న భారత జట్టు కొలంబో వెళ్తుంది. మ్యాచ్ సమయానికి కల్లా ఆటగాళ్లంతా స్టేడియం చేరుకుంటారు. మ్యాచ్ రద్దయిందని రిఫరీ ప్రకటించాకే టీమిండియా బృందం స్వదేశానికి బయల్దేరుతుంది’ అని పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!


