గోదావరిఖని, జూన్ 18: సింగరేణి సంస్థకు అరుదైన గౌరవం లభించింది. సంస్థ అనుసరిస్తున్న వ్యయ నియంత్రణ చర్యలకు గాను జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
2024 సంవత్సరానికిగాను ఇనిస్టిట్యూట్ ఆఫ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఎంఏఐ) అందజేసే పురస్కారాల్లో సింగరేణి సంస్థకు తృతీయ బహుమతి వరించింది. ఈ అవార్డుకు ఎంపికపై సంస్థ సీఎండీ బలరామ్ హర్షం వ్యక్తం చేశారు.