హనుమకొండ చౌరస్తా, జూన్ 18: జూన్ 20వ తేదీన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ యోగా టీచర్స్ కో ఆర్డినేషన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జరుగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని ప్రముఖ యోగా గురువు టివైటిటిసి వరంగల్ ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీ పోశాల శ్రీనివాస్ తెలిపారు. హనుమకొండ ప్రెస్‌క్లబ్ లో జరిగిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు.
‘ఒక భూమి-ఒక ఆరోగ్యం’ అనే థీమ్ తో 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని11వ సంవత్సరాలలోకి అడుగుపెడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో పాల్గొనడానికి మాజీ ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, నందమూరి బాలకృష్ణ, టీవైసీసీ ప్రెసిడెంట్ రవికిశోషోర్ సినీపుముఖులు పాల్గొనే ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా యోగా ప్రేమికులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యోగాసాధకులు నాగిళ్ల, వేణు శర్మ, జయశ్రీ, శ్రీవిద్య, రాజేష్ పాల్గొన్నారు.