పశ్చిమాసియాపై చర్చకు పట్టు.. ఓం బిర్లా తొలగింపు తీర్మానంపై లోక్‌సభలో జరగని చర్చ
పశ్చిమాసియా పరిస్థితిపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో సోమవారం లోక్‌సభలో గందరగోళం నెలకొన్నది. దీంతో స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్‌సభ చర్చించలేకపోయింది. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఈ తీర్మానంపై లోక్‌సభ చర్చించే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ, మార్చి 9 : పశ్చిమాసియా పరిస్థితిపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో సోమవారం లోక్‌సభలో గందరగోళం నెలకొన్నది. దీంతో స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్‌సభ చర్చించలేకపోయింది. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఈ తీర్మానంపై లోక్‌సభ చర్చించే అవకాశం ఉంది. సభలో తనను తాను సమర్థించుకునే హక్కును రాజ్యాంగం స్పీకర్‌కు ఇచ్చినప్పటికీ ఓం బిర్లాకు వ్యతిరేకంగా తీర్మానంపై చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించనున్నట్లు తెలిసింది. సభా కార్యకలాపాల నిర్వహణలో ఓం బిర్లా పూర్తి పక్షపాతంతో వ్యవహరించారని విపక్షం ఆరోపించింది. కాగా, పశ్చిమాసియాలో ప్రస్తుత సంక్షోభంపై పార్లమెంట్లో చర్చించాలన్న విపక్షాల డిమాండుకు ప్రభుత్వం ఒప్పుకొనే అవకాశం లేదని తెలుస్తున్నది. సోమవారం విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంట్ ఉభయసభలలో పశ్చిమాసియాపై ప్రకటన చేశారు.
ప్రతిపక్షాలు తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వాన్ని లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వం, స్పీకర్ సోమవారం లోక్‌సభలో ఆరోపించారు. విపక్ష సభ్యులు నిరసనల మధ్య సభ సోమవారం రెండుసార్లు వాయిదాపడింది. మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి సమావేశమైన తర్వాత స్పీకర్ స్థానంలో ఉన్న జగదంబికా పాల్ విపక్ష ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చించాలని కోరారు. స్పీకర్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభ ఎజెండాలో ఉందని, దీనిపై చర్చ ప్రారంభించాలని జగదంబికా పాల్ సూచించారు. పశ్చిమాసియాపై చర్చకు అనుమతించబోమని ఆయన చెప్పారు. రోజుకు రూ.9 కోట్ల ప్రజాధనాన్ని విపక్ష సభ్యులు వృథా చేస్తున్నారని ఆరోపించిన ఆయన విపక్షాల ప్రవర్తనను అపరిపక్వం, బాధ్యతారాహిత్యంగా అభివర్ణించారు.
గల్ఫ్‌లోని భారతీయుల భద్రతకే ప్రాధాన్యం : జైశంకర్
పశ్చిమాసియా ఘర్షణలపై భారత్ విధానం మూడు సిద్ధాంతాల ద్వారా మార్గనిర్దేశం పొందినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. శాంతిని ప్రోత్సహించడం, పౌర భద్రత-భారతీయ సమాజ భద్రత, ఇంధన భద్రత, వాణిజ్యం వంటి జాతి ప్రయోజనాల పరిరక్షణ వంటి సిద్ధాంతాల ద్వారా ఈ విధానం రూపొందినట్లు ఆయన సోమవారం రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని భారత్ పిలుపునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గల్ఫ్ లోని భారతీయుల భద్రతకు ప్రాధాన్యమిచ్చామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

