Jani Master | తెలిసీ తెలియక తప్పు జరిగి ఉంటే క్షమించండి : జానీ మాస్టర్
TFTDDA | తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార వేడుకలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్తో తలెత్తిన విభేదాలు మరియు వివాదాల పట్ల జానీ మాస్టర్ బహిరంగంగా క్షమాపణలు కోరారు.
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార వేడుకలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్తో తలెత్తిన విభేదాలు మరియు వివాదాల పట్ల జానీ మాస్టర్ బహిరంగంగా క్షమాపణలు కోరారు. గత కాలపు పొరపాట్లను పక్కనపెట్టి మళ్లీ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకున్నామని, కొంతకాలం అసోసియేషన్‌కు దూరంగా ఉన్నప్పటికీ మళ్లీ అందరితో కలిసి పనిచేసేందుకు వచ్చానని ఆయన స్పష్టం చేశారు. ఇకపై అందరం ఒకే కుటుంబంలా కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
నిర్మాతలు ఇచ్చే పారితోషికాలు డ్యాన్సర్లకు పూర్తిగా అందడం లేదనే తీవ్ర ఆవేదనతోనే గతంలో తాను మాట్లాడాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇదే అంశంపై మెగాస్టార్ చిరంజీవిని కలిసినప్పుడు, ఆయన ఎంతో సానుకూలంగా స్పందించి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో తన మాటల ద్వారా ఎవరికైనా మనస్తాపం కలిగి ఉంటే, లేదా తెలిసీ తెలియక ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని ఇండస్ట్రీ పెద్దలను జానీ మాస్టర్ కోరారు. తండ్రి కోప్పడినా చివరికి పిల్లలను దగ్గరకు తీసుకున్నట్లే, సినీ పరిశ్రమ పెద్దలు మరియు నిర్మాతల మండలి డ్యాన్సర్ల అసోసియేషన్‌ను కలుపుకొని ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

