వరంగల్ చౌరస్తా : అర్ధరాత్రి చేతిలో కత్తితో వీధులెంట సంచరిస్తూ ఓ యువకుడు హాల్ చల్ చేశాడు. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామన్నపేట ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో అర్ధనగ్నంగా చేతిలో కత్తితో సంచరించడం చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ సరిగా నిర్వహించకపోవడంతో ఇలాంటి ఘటనలు, దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని నిత్యం భయాందోళనల మధ్య జీవించాలి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయం పై స్థానిక మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపిని వివరణ కోరగా విషయం తమ దృష్టికి రాలేదని, ఎలాంటి పిర్యాదు అందలేదని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు పక్కాగా పెట్రోలింగ్ నిర్వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.