Bachannapet | బచ్చన్నపేటలోనే పాలు కొనుగోలు చేయాలని పాడి రైతుల ధర్నా
విజయ పాల ఉత్పత్తిదారుల కేంద్రంలోనే తమ పాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండలంలోని కొన్నె గ్రామ పాడి రైతులు పాల క్యాన్లతో ధర్నా నిర్వహించారు.
బచ్చన్నపేట మార్చి 01 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని విజయ పాల ఉత్పత్తిదారుల కేంద్రంలోనే తమ పాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండలంలోని కొన్నె గ్రామ పాడి రైతులు పాల క్యాన్లతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగామకు పాలు తరలించడం వల్ల తమకు అన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే గ్రామం నుంచి జనగాం వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
సకాలంలో బిల్లులు కూడా రావడం లేదని మొరపెట్టుకున్నారు.
ఈ విషయమై మేనేజర్ డిడి, సూపర్వైజర్, బీఎంసీ చైర్మన్ లకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు . తమ సమస్య పరిష్కరిస్తామని చెప్పి జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమ గ్రామానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన బచ్చన్నపేటకి తమ పాలు తీసుకునేలా అనుమతులు ఇవ్వాలని వారు కోరారు. ఈ మేరకు సంబంధిత బాధ్యులు వచ్చి ఇకనుంచి పాలు బచ్చన్నపేటలోనే తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పాడి రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

