ViRosh Wedding New Pics | ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహానికి సంబంధించిన సరికొత్త ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. “విరోష్” (ViRosh) అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే ఈ జంట తమ పెళ్లి వేడుకలో పీరియడ్ ఎరా (Periodic Era) థీమ్‌తో భారతీయ వారసత్వం ప్రతిబింబించేలా ప్లాన్ చేశారు. అయితే తాజాగా విడుదలైన ఈ చిత్రాలలో రష్మిక రాయల్ డోలీలో ఎంట్రీ ఇవ్వగా, విజయ్ రాజసం ఉట్టిపడేలా చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ముఖ్యంగా రష్మిక మందన్న సంప్రదాయబద్ధమైన పల్లకిలో (Palki) కూర్చుని చిరునవ్వుతో వస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. పాతకాలపు వైభవాన్ని గుర్తుచేసేలా రూపొందించిన ఈ వివాహ సెటప్‌లో, విజయ్ దేవరకొండ రాయల్ లుక్‌లో ఖడ్గాన్ని పట్టుకుని ఉండటం చూస్తుంటే ఒక మహారాజు పెళ్లిని తలపిస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వేడుకలో ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం, సాయంత్రం కొడవ (Kodava) ఆచారాల ప్రకారం రెండు పద్ధతుల్లో వీరు ఒక్కటయ్యారు.
నటి రష్మిక తన సోషల్ మీడియాలో ఈ ఫొటోలను పంచుకుంటూ విజయ్ను తన భర్తగా గర్వంగా పరిచయం చేయడమే కాకుండా, పెళ్లి వేడుకలోని భావోద్వేగపూరితమైన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ జంటకు ప్రత్యేకంగా అభినందన లేఖను పంపగా, మార్చి 4న హైదరాబాద్‌లో జరగబోయే గ్రాండ్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలిరానున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పెళ్లి ఫొటోలు అత్యధిక లైక్‌లు సాధించిన భారతీయ సెలబ్రిటీ పోస్ట్‌గా రికార్డు సృష్టించాయి.
Some unseens from the wedding of #Virosh ♥️@iamRashmika @TheDeverakonda #RashmikaMandanna #VijayDeverakonda pic.twitter.com/EfzMcLfLsj
— Rashu 💕 (@rashmikaxlife) February 28, 2026