రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ప్రజలందకి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని కేశవాపురం, ఆరెగూడెం, కొలనుపల్లి, కొండూరు, బురహానుపల్లి, కాట్రపల్లి, పోతిరెడ్డిపల్లి, కిష్టాపురం, గన్నారం, తిరుమలాయపల్లి తదితర గ్రామాలలో మండల స్థాయి అధికారులతో కలిసి ఆమె విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన పలు అభివృద్ధి పనులు, నిర్మాణాలకు ఆమె శంకుస్థాపనలు, భూమి పూజలు చేశారు.
రాబోయే రెండు నెలల లోపు ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెన్షన్లు తప్పక అందజేస్తామన్నారు. గ్రామాల్లోని అర్హులైన ప్రజలందరికి విడతలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి తీరుతామన్నారు. రైతు భరోసానిధులు రైతులందరి ఖాతాలలో జమ చేస్తున్నట్లు చెప్పారు. ఆమె వెంట తహసిల్దార్ ముల్కనూరు శ్రీనివాస్, ఎంపీడీవో గుగులోతు కిషన్ నాయక్, పలు శాఖల డీఈలు, ఏఈలు వాసం బాబురావు, తాళ్లపల్లి శ్రీ ప్రియ, కొయ్యడ చంద్రమోహన్, కూచన ప్రకాష్, మండల నాయకులు పాల్గొన్నారు.