శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాపై ఛార్జిషీట్ సిద్ధమైంది. దాదాపు 3 వేల పేజీలతో రెడీగా ఉన్న ఈ ఛార్జిషీట్‌ను నిపుణులు సమీక్షిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ ఎవరని అసోం సీఎం హేమంత బిస్వ శర్మ ప్రశ్నించారు. సినిమా గురించి షారుఖ్ ఫోన్ చేస్తే విషయం పరిశీలిస్తానని చెప్పారు. డాక్టర్ బెజ్బరువా - పార్ట్ 2’ సినిమా చూడాలని పిలుపునిచ్చారు.
రాహుల్‌గాంధీని ఫరూక్ అబ్దుల్లా ఆకాశానికెత్తారు. రాహుల్‌ను ఆది శంకరాచార్యతో పోల్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన రెండో వ్యక్తి రాహుల్ అని కొనియాడారు.
ప్రధాని మోదీ ఓ ర్యాలీలో పాల్గొనడానికి ముందు నకిలీ సైనికుడొకరిని గుర్తించారు. గార్డ్స్ రెజిమెంట్ నాయక్ అని చెప్పిన రామేశ్వర్ మిశ్రాను అదుపులోకి తీసుకుని ముంబై పోలీసులు విచారిస్తున్నారు.
జార్ఖండ్‌లోని గొడ్డా ప్రాంతంలో జరపతలపెట్టిన బొగ్గు తవ్వకాలను ఆదివాసీలు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. పోలీసులు లాఠీ చార్జ్ చేయగా.. ఆదివాసీలు బాణాలతో దాడికి పాల్పడ్డారు.
ఉత్తర భారతదేశం చలిగాలుల గుప్పిట్లో గజగజలాడుతున్నది. ఢిల్లీ, కాన్పూర్‌లో గత చలిగాలుల రికార్డులు బద్దలయ్యాయి. యూపీ, ఉత్తరాఖండ్‌లో వానలు పడే సూచనలున్నాయి.
SGPC Dhami | మొహలీలో ఎస్జీపీసీ చీఫ్ ధామి కారుపై అటాక్ జరిగింది. సిక్కు ఖైదీలను విడుదల చేయాలంటూ ఆందోళన చేస్తున్న వారు ధామి కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు.
Baby jain monk | సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి మనవరాలు దేవాన్షీ జైన సన్యాస దీక్ష చేపట్టింది. వేల మంది సమక్షంలో ఈ 9 ఏండ్ల చిన్నారి జైన సన్యానిగా మారింది. చిన్నారి తల్లిదండ్రులు అదృష్టంగా భావిస్తున్నారు.
Currency in Assembly | మాఫియా చేస్తున్న ఉద్యోగ నియామకాలపై నోరెత్తకుండా ఉండేందుకు తనకు లంచం ఇచ్చారని ఆప్ ఎమ్మెల్యే ఆరోపించారు. రూ.15 లక్షల నోట్ల కట్టలను అసెంబ్లీకి తెచ్చి ప్రదర్శించారు.
Land sinking | జోషీమఠ్ దృశ్యాలు ఇప్పుడు హిమాచల్‌లోని మండీ జిల్లాలో కనిపిస్తున్నాయి. మండీ జిల్లాలోని మూడు గ్రామాల్లో భూమి కుంగిపోయింది. 32 ఇళ్లలో పగుళ్లు ఏర్పడటంతో ప్రజలు భయపడిపోతున్నారు.
Chandigarh Mayor | చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో మూడు ముఖ్య పదవులను బీజేపీ మరోసారి దక్కించుకున్నది. కాంగ్రెస్‌లో గెలిచి పార్టీ మారిన ఇద్దరు సభ్యులతో బీజేపీ బలం పెంచుకున్నది.