దుబాయ్: ఇరాన్‌తో వార్ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి(Strait of Hormuz) కీలకంగా మారింది. వేల సంఖ్యలో చమురు నౌకలు అక్కడే చిక్కుకుపోయాయి. అయితే అమెరికా దాడుల నేపథ్యంలో ఆ జలసంధి వెంట వెళ్లే చమురు నౌకలను అడ్డుకునేందుకు ఇరాన్ ప్లాన్ వేసింది. దీని కోసం మైన్ లేయింగ్ నౌకలను అక్కడ మోహరించింది. అయితే మంగళవారం అమెరికా ఆ నౌకలపై దాడి చేసింది. హోర్ముజ్ జలసంధి వద్ద ఉన్న సుమారు 16 మైన్‌లేయింగ్ నౌకలను పేల్చినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్(US Central Command) పేర్కొన్నది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సెంట్రల్ కమాండ్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
U.S. forces eliminated multiple Iranian naval vessels, March 10, including 16 minelayers near the Strait of Hormuz. pic.twitter.com/371unKYiJs
— U.S. Central Command (@CENTCOM) March 10, 2026
శత్రు నౌకలను పేల్చేందుకు లేదా.. తమ భద్రతను పెంచుకునేందుకు మైన్ లేయింగ్ నౌకలను ఇరాన్ వాడుతోంది. ఈ నౌకలు విస్పోటకాలతో నిండి ఉంటాయి. యాక్టివ్‌లో లేనటువంటి సుమారు 10 నౌకలను పేల్చినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్న మరుసటి రోజే సెంట్రల్ కమాండ్ వీడియోను పోస్టు చేసింది.