జోషిమఠ్ తరహాలో ముప్పు ముంగిట ఉత్తరకాశీ, నైనిటాల్ : నిపుణుల హెచ్చరిక
ఉత్తరాఖండ్లో ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన జోషిమఠ్లో భూమి కుంగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్ధితి నెలకొంది.
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన జోషిమఠ్లో భూమి కుంగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్ధితి నెలకొంది. 600కు పైగా ఇండ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇక జోషిమఠ్ పట్టణమే కాకుండా ఉత్తరకాశీ, నైనిటాల్కూ ప్రమాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయాల చెంతనున్న పలు పట్ణణాలు, నగరాల్లో భూమి కుంగుబాటుకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
స్ధానిక భౌగోళిక పరిస్ధితులను విస్మరిస్తూ కార్యకలాపాలను చేపట్టిన ఫలితంగానే పర్యావరణ అననుకూల పరిస్ధితులకు దారితీస్తోందని వారు స్పష్టం చేశారు. బలహీన పునాదులతో పాటు, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల భూమి కోతకు గురవడం కూడా జోషిమఠ్లో ఈ పరిస్ధితి నెలకొందని వారు వివరించారు. మానవ ప్రేరిత కార్యకలాపాలు దీనికి మరింత ఆజ్యం పోశాయని చెబుతున్నారు.
ఎంసీటీ-2 జోన్ రీయాక్టివేట్ కావడంతో ఒక్కసారిగా జోషిమఠ్లో భూమి కుంగిపోయిందని, ఈ రీయాక్టివేషన్ ఎప్పుడు జరుగుతుందని ఏ భూగర్భ శాస్త్రవేత్త అంచనా వేయలేరని కుమౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బహదూర్ సింగ్ కోట్లియా చెప్పారు. జోషిమఠ్ ఒక్కటే ఇలాంటి పరిస్ధితికి గురికాబోదని, ఉత్తర కాశీ, నైనిటాల్కూ ఈ ముప్పు ఉందని హెచ్చరించారు. తాము రెండు దశాబ్ధాల నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఇప్పటివరకూ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రకృతితో మీరు పోరాడి గెలవలేరని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

