BJP colouring | డబుల్ ఇంజిన్ అంటూ ఇప్పటిదాకా కలరింగ్ ఇచ్చుకున్న బీజేపీ నేతలు.. ఇప్పుడు నిజంగానే తమ సమావేశాలకు కలరింగ్ ఇచ్చుకున్నది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా బీజేపీ కలరింగులు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఓ కాంగ్రెస్ నేత సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కమలనాథులారా కలరింగ్ అంటే ఇదేనా? వావ్ శివరాజ్ వావ్..! అంటూ సెటైర్ వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ అగ్రనేతలు తలలు పట్టుకున్నారు.
మధ్యప్రదేశ్ వాణిజ్య రాజధాని ఇండోర్‌లో ప్రవాస భారతీయ సమ్మేళన్ (గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్) 2023 నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ సమ్మేళనం ఈ నెల 11-12 తేదీల్లో జరుగనున్నది. ‘మధ్యప్రదేశ్-ది ప్యూచర్ రెడీ స్టేట్’ పేరుతో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సమమ్మేళనాన్ని విజయవంతం చేసేందుకు సవాల్‌గా తీసుకున్నది. అధికారులు పగలు, రాత్రి పనిచేస్తున్నారు. సమ్మిట్ మరో మూడు రోజుల్లో మొదలవుతుందనగా.. కమలనాథుల కలరింగ్ బయటపడింది. కలరింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాన్ని కవరింగ్ చేసుకునే ప్రయత్నంలో సీనియర్ నేతలు నిమగ్నమై ఉన్నారు.
ఇండోర్‌లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఆయనతోపాటు ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, రిలయన్స్, టాటా, అదానీ, బిర్లా వంటి దాదాపు 70 సంస్థల అధిపతులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సమ్మిట్‌కు వెళ్లే రోడ్డు పక్కన డివైడర్ల మధ్యన గడ్డి ఎండిపోయి ఉన్నది దర్శనమిచ్చింది. అంతే, అప్పటికప్పుడే గడ్డి రంగునే అధికారులు మార్చేయించారు. స్ప్రే పెయింటర్‌ను తీసుకొచ్చి ఎండు గడ్డిపై గ్రీన్ కలర్‌ను పిచికారీ చేయించారు. అలా ఎండు గడ్డికి కలరింగ్ ఇచ్చి తాజాగా ఉన్నట్లు బుకాయించే ప్రయత్నం చేశారు. ప్రజలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బీజేపీ ప్రభుత్వాలు బుకాయిస్తున్న తీరు ఇక్కడి పనుల్లో కనపడుతున్నదని వ్యాఖ్యానించారు.
अकल्पनीय, अविश्वसनीय तस्वीरें..
प्रधानमंत्री के इंदौर दौरे के पहले इंदौर को हरा-भरा बनाने के लिए BJP सरकार ने घास को ही हरे रंग से रंग दिया। वाह शिवराज वाह!! pic.twitter.com/tMJ2jKc01V
— Srinivas BV (@srinivasiyc) January 8, 2023