బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఖమ్మంలో నిర్వహించిన తొలి బహిరంగ సభ విజయవంతమైంది. జిల్లా నుంచే కాకుండా చుట్టపక్కల జిల్లాల నుంచి జనం స్వచ్ఛందంగా తరలిరావడంతో ఖమ్మం నిండుకుండలా మారింది.
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చడం పైనే ప్రధాని మోదీ దృష్టి పెడుతున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన తరుణం వచ్చిందని, ఆ పార్టీ అధికారంలో ఉంటే పేదలు మరింత పేదలుగా మారుతారని, కేంద్రంలో ఉన్నది కార్పొరేట్ల ప్రభుత్వమని కేరళ సీఎం పినరాయి విజయన్ చెప్పారు.
భారతదేశం ప్రమాదకర స్థితిలో ఉన్నదని, బీజేపీ, ఆరెస్సెస్ కూటమి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఆందోళన వ్యక్తం చేశారు.
అబద్ధాలతో అధికారం చేపట్టిన బీజే పీ.. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అడ్డదారిలో గద్దెనెక్కాలని కుట్ర చేస్తున్నదని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మండిపడ్డారు.
కేంద్రంలో మతతత్వ బీజేపీని గద్దె దించేందుకే తాము కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.
పేదవాడు బతికే అవకాశం లేకుండా నిత్యావసరాల ధరలను పెంచడంతోపాటు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత ఖమ్మంలో మొదటి భారీ బహిరంగ సభ.. ఉదయం నుంచే అంతటా ఉత్కంఠ.. అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతారు? ఉజ్వల భారత్ కోసం ఏం చేయబోతున్నారు? ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారు? అనే ద�