(స్పెషల్ టాస్ బ్యూరో) ఖమ్మం,జనవరి 18 ( నమస్తే తెలంగాణ ) : ఫెడరల్ స్ఫూర్తికి విరుధ్ధంగా సాగుతున్న కేంద్రంలోని బీజేపీ సరారు రోజులు లెక పెట్టుకుంటున్నదని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఖమ్మం సభలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి మరో 400 రోజుల సమయం మిగిలి ఉందన్న బీజేపీ పెద్దల వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు వారికి కేవలం 399 రోజులే మిగిలాయని చెప్తూ, బీజేపీ నాయకులు స్వయంగా తమ ప్రభుత్వ సమయాన్ని లెకించుకుంటున్నారంటే, ప్రభుత్వం మళ్లీ గెలవదన్న సంగతి వారికీ అర్థమైందని ఎద్దేవా చేశారు.
ప్రజలకు వివిధ రకాల భ్రమలు కల్పించి రెండుసార్లు గద్దె నెకిన బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ భ్రమలు వీడిపోతాయని పేర్కొన్నారు. బీజేపీ పాలనతో దేశం మరింత వెనకి వెళ్ళిందని, అన్ని రంగాలలో అభివృధ్ధి కుంటుబడిందని, నిరుద్యోగం, పేదరికం, వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం..మొదలైన అన్నిరంగాలలో అభివృధ్ధి నిలిచిపోయిందని మండిపడ్డారు. జీ20 సమావేశాలంటూ ప్రచారార్భాటం మాటున ప్రధాని మోదీ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. యూపీలో తప్పుడు వాగ్దానాలతో గద్దె నెకిందని, ఈ సారి ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారని తెలిపారు. మౌలిక అవసరాలైన తాగు, సాగునీరు, విద్యు త్తు, విద్య, వైద్యం వంటి రంగాలకు ప్రాధాన్యమివ్వకుండా జాతి సంపదను కార్పొరేటు సంస్ధలకు మోదీ కట్టబెడుతున్నారని మండిపడ్డారు.
బీజేపీ కేంద్ర సరారును గద్దే దించేందుకు నడుం కట్టిన తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు తాము అండగా ఉంటామని అఖిలేశ్ ప్రకటించారు. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ ఆధిపత్య ధోరణిని నిలవరించి, అధికార వికేంద్రీకరణ సాధిస్తారన్న నమ్మకాన్నీ ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన అనతికాలంలోనే తెలంగాణను అన్ని రంగాలలో అభివృధ్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ ప్రచారంలో వెనుకబడ్డారని అన్నారు. కేంద్రంలోని మోదీ సరారు తప్పుడు ప్రచారాలు, వాగ్దానాలతో ప్రజల్లో భ్రమలు కల్పిస్తుంటే, కేసీఆర్ మాత్రం తెలంగాణలో ఎన్నో అభివృధ్ధి పనులు చేసినా, దేశ వ్యాప్తంగా ప్రచారం చేయటంలో వెనుకబడ్డారని అభిప్రాయపడ్డారు. తాను యాదగిరిగుట్టలో పునర్నిర్మించిన నరసింహ స్వామి దేవాలయాన్ని చూసి విస్తుపోయానని చెప్పారు