ముంబై: క్లాస్‌రూమ్‌లో లెక్క తప్పుగా చేసిన స్టూడెంట్‌పై టీచర్ ప్రతాపం చూపింది. ఆ బాలికను దారుణంగా కొట్టడంతో ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. చైల్డ్ హెల్ప్‌లైన్ జోక్యంతో ఆ టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. (Teacher Beats Student Brutally) మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నాగ్‌పూర్‌లోని డియోలి కలాన్‌లో ఉన్న జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పదేళ్ల బాలిక ఐదో తరగతి చదువుతున్నది.
కాగా, మార్చి 10న చేతికి తీవ్ర గాయంతో స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తమ కుమార్తెను చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆరా తీయగా క్లాస్‌లో లెక్క తప్పుగా చేసినందుకు ఉపాధ్యాయురాలు దారుణంగా కొట్టినట్లు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆ టీచర్ బాలిక తల్లిదండ్రులను స్కూల్‌కు పిలిపించింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ బాలికను స్కూల్ నుంచి బహిష్కరిస్తామని ఆమె బెదిరించింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న చైల్డ్ హెల్ప్‌లైన్ బృందం ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో చైల్డ్ హెల్ప్‌లైన్ జోక్యం తర్వాతే ఆ ఉపాధ్యాయురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read:
woman kills mother-in-law | ప్రియుడితో పట్టుబడిన కోడలు.. అత్తను చంపి గుండెపోటుగా నమ్మించేందుకు యత్నం
Surat woman killed | పెద్ద కోడలు, చిన్న కొడుకు మధ్య సంబంధం.. వ్యతిరేకించిన తల్లిని హత్య
Watch: బిర్యానీలో కుక్క కాలు.. వీడియో వైరల్