Trisha | పార్తీబన్ కూతురితో కలిసి కనిపించిన త్రిష.. ముంబై వెడ్డింగ్‌లో సందడే సందడి
Trisha | దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచింది. నటుడు పార్తీబన్ వివాదం తర్వాత ఆయన కూతురు కీర్తన పార్తీబన్‌తో కలిసి కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలో జరిగిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఏకా లఖానీ పెళ్లి వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Trisha | దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచింది. నటుడు పార్తీబన్ వివాదం తర్వాత ఆయన కూతురు కీర్తన పార్తీబన్‌తో కలిసి కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలో జరిగిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఏకా లఖానీ పెళ్లి వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో దర్శకుడు మణిరత్నం, నటుడు సిద్ధార్థ్, హీరోయిన్ త్రిష వంటి పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. అదే వేడుకకు నటుడు పార్తీబన్ కుమార్తె కీర్తన పార్తీబన్ కూడా హాజరైంది.
ఈ సందర్భంగా త్రిష, కీర్తన కలిసి ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఇద్దరూ నవ్వుతూ దిగిన ఫోటోను త్రిష తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ “The Gen Z’s and I” అనే క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటుడు పార్తీబన్‌తో గతంలో జరిగిన వివాదం తర్వాత కూడా ఆయన కూతురితో త్రిష ఎంతో ఆప్యాయంగా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. గొడవలన్నీ ముగిసినట్టే కనిపిస్తున్నాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తండ్రి చేసిన తప్పుకు కూతురిపై కోపం చూపకుండా పెద్ద మనసుతో వ్యవహరించిన త్రిషను పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇదిలా ఉండగా, పార్తీబన్ కుమార్తె కీర్తన పార్తీబన్ చిన్ననాటే సినిమాల్లో కనిపించింది. మణిరత్నం తెరకెక్కించిన ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’ సినిమాలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఇక త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కరుప్పు’ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’ సినిమాలో కూడా త్రిష కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. దీంతో త్రిష మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

