Volumetrics Diet | కొత్తగా ప్రచారం అవుతున్న వాల్యూమెట్రిక్స్ డైట్.. ఏంటిది.. ఎలా ఫాలో అవ్వాలి..
బరువు తగ్గాలని చాలామంది డైట్ పేరుతో ఆహారాన్ని పూర్తిగా తగ్గించుకోవడం లేదా వింతైన డైట్లను అనుసరించడం చేస్తున్నారు. స్లీపింగ్ బ్యూటీ డైట్, బేబీ ఫుడ్ డైట్, ఐస్ డైట్, సిర్ట్ఫుడ్ డైట్, హోల్30 డైట్ వంటి వాటి తర్వాత ఇప్పుడు వాల్యూమెట్రిక్స్ డైట్ కూడా బరువు తగ్గించే విధానంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
Volumetrics Diet | బరువు తగ్గాలని చాలామంది డైట్ పేరుతో ఆహారాన్ని పూర్తిగా తగ్గించుకోవడం లేదా వింతైన డైట్లను అనుసరించడం చేస్తున్నారు. స్లీపింగ్ బ్యూటీ డైట్, బేబీ ఫుడ్ డైట్, ఐస్ డైట్, సిర్ట్ఫుడ్ డైట్, హోల్30 డైట్ వంటి వాటి తర్వాత ఇప్పుడు వాల్యూమెట్రిక్స్ డైట్ కూడా బరువు తగ్గించే విధానంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే మిగతా కొన్ని డైట్లతో పోలిస్తే ఇది తక్కువ కేలరీలు, ఎక్కువ పరిమాణంలో ఉండే ఆహారాలను ఎంచుకోవడంపై దృష్టి పెడుతుంది. వాల్యూమెట్రిక్స్ డైట్లో తక్కువ కేలరీలు, ఎక్కువ నీరు లేదా పీచు పదార్థాలు ఉండే ఆహారాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇలాంటి ఆహారాలు ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయని ఈ విధానం చెబుతోంది. పండ్లు, కూరగాయలు, సూప్‌లు వంటి సహజంగా తక్కువ కేలరీలు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ఇందులో ముఖ్యమైన అంశం. ఈ డైట్ విధానాన్ని పోషకాహార నిపుణురాలు బార్బరా రోల్స్ అభివృద్ధి చేశారు. ఇందులో ఏ ఆహారాన్నీ పూర్తిగా నిషేధించరు. అయితే రోజుకు తీసుకోవాల్సిన కేలరీల పరిమితిని దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని ఎంచుకోవాలని సూచిస్తారు. అంటే నచ్చిన ఆహారాన్ని పూర్తిగా మానేయడం కంటే, తక్కువ కేలరీలు ఉండే ఆహారాలతో కడుపు నిండేలా చూసుకోవడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం.
నాలుగు గ్రూపులుగా విభజన..
వాల్యూమెట్రిక్స్ డైట్లో ఆహారాలను నాలుగు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో పిండి పదార్థాలు తక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, కొవ్వు లేని పాలు, బ్రోత్ ఆధారిత సూప్‌లు ఉంటాయి. రెండో గ్రూపులో పిండి పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్, తక్కువ కొవ్వు మాంసం, పప్పుధాన్యాలు వంటి ఆహారాలు ఉంటాయి. మూడో గ్రూపులో మాంసం, చీజ్, ఫ్రెంచ్ ఫ్రైస్, సలాడ్ డ్రెస్సింగ్, బ్రెడ్, ఐస్‌క్రీమ్, కేక్ వంటి వాటిని చేర్చారు. నాలుగో గ్రూపులో చిప్స్, చాక్లెట్ క్యాండీలు, కుకీలు, నట్స్, వెన్న, నూనె వంటి అధిక కేలరీలు ఉండే ఆహారాలు ఉంటాయి. ఇందులో మొదటి, రెండో గ్రూపులకు చెందిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. మూడో గ్రూపులోని ఆహారాలను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. నాలుగో గ్రూపులోని ఆహారాలను వీలైనంత వరకు తగ్గించాలి. ఈ విధానంలో ప్రధానంగా తక్కువ కేలరీలున్న ఆహారాలను ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉండి బరువు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఒక అధ్యయనంలో 97 మంది ఊబకాయం ఉన్న మహిళలను రెండు గ్రూపులుగా విభజించి పరిశీలించారు.
వ్యాయామమూ ముఖ్యమే..
ఒక గ్రూపుకు తక్కువ కొవ్వు ఆహారం, మరో గ్రూపుకు పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యం ఇచ్చే తక్కువ కేలరీల సాంద్రత కలిగిన ఆహారం అందించారు. ఏడాది తర్వాత రెండు గ్రూపుల్లోనూ బరువు తగ్గినప్పటికీ, పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యం ఇచ్చిన గ్రూపులో సుమారు 14 పౌండ్ల బరువు తగ్గగా, మరో గ్రూపులో సుమారు 10 పౌండ్ల బరువు తగ్గినట్లు అధ్యయనం తెలిపింది. వాల్యూమెట్రిక్స్ డైట్లో ఆహారంతోపాటు వ్యాయామానికీ ప్రాధాన్యం ఉంటుంది. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు రోజుకు సుమారు 30 నుంచి 60 నిమిషాల వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. అయితే ఏదైనా డైట్ విధానాన్ని ప్రారంభించే ముందు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, పోషక అవసరాలను పరిగణనలోకి తీసుకుని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

