Balka Suman | క్యాతనపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం: బాల్క సుమన్
Balka Suman | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్-సీపీఐ కూటమి గెలుచుకుందని పేర్కొన్నారు.
Balka Suman | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్-సీపీఐ కూటమి గెలుచుకుందని పేర్కొన్నారు. మెజారిటీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ చైర్పర్సన్ ఎన్ని జరకుండా కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసు నేపథ్యంలో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌కు ఇవాళ బాల్క సుమన్ హాజరయ్యారు.
అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ.. ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా దౌర్జన్యంగా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. గత నెల 16, 17వ తేదీల్లో చైర్పర్సన్ ఎన్నిక జరకుండా వివేక్ అడ్డుకున్నారని తెలిపారు. తనతో సహా 25 మంది బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. రెండేళ్లలో సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని విమర్శించారు.
మందమర్రి ఏరియాలో కాసిపేట 2 ఇంక్లైన్ బొగ్గు గని తెచ్చిన ఘనత బీఆర్ఎస్దే అని బాల్క సుమన్ తెలిపారు. సింగరేణి ఏరియాలో మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత నాటి సీఎం కేసీఆర్‌దే అని స్పష్టం చేశారు. మంత్రి వివేక్‌కు ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటే కొత్త భూగర్భ గనులు తీసుకురావాలని సూచించారు. హైకోర్టు తీర్పు ప్రకారం క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికను అధికారులు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన కక్ష పూరిత కేసుల నేపథ్యంలో ఈరోజు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో హాజరవడం జరిగింది. pic.twitter.com/ckQT16LTtv
— Balka Suman (@balkasumantrs) March 15, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

