మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం రొయ్య పిల్లలు, చేప పిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేస్తోందని గుర్తుచేశారు.
భద్రాద్రి జిల్లాలో ఈసారి విస్తారంగా పత్తి సాగైంది. ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తున్నది. కూలీలకు ఉపాధి లభిస్తున్నది. మరోవైపు క్వింటా పత్తికి ధర రూ.9,500 వరకు పలుకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బూర్గంపహాడ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో ఇక నుంచి రోజలంతా నిరంతరాయంగా వైద్య సేవలు అందుతాయని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. ఈ సెంటర్ను ఆయన శుక్రవారం సందర్శించారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా వారి సౌలభ్యం కోసమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలను చేపట్టిందని హరితహారం ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్ పేర్కొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం కార్తీకమాస వన సమారాధనలు వేడుకలా జరిగాయి. వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కాలువల నిర్మాణాలు, ఇతర పనులు చకచకా జరుగుతున్నాయి.
అప్పులు చేసి.. ఆరుగాలం శ్రమించి.. ప్రకృతి విపత్తుల నుంచి పైరును కాపాడి రైతు పంట పండిస్తాడు.. ఆ పంటకు గిట్టుబాటు ధరను ఆశిస్తాడు.. మంచి ధర లభించకుంటే తాను ఆశించిన ధర వచ్చే వరకు పంటను దాచిపెట్టాలనుకుంటాడు..