స్వరాష్ట్ర పాలనలో గడప గడపకూ సంక్షేమం.. వాడవాడలా అభివృద్ధి చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేదలకు ఎల్లప్పుడూ అం డగా నిలిచారని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింట్లో పుట్టిన ఆడబిడ్డలకు కొండంత భరోసానిస్తున్నాయని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు.
మండలంలోని చిన్నకోరుకొండి గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం పంపిణీ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్ని వేళలా వైద్యసేవలందించేందుకే సీఎం కేసీఆర్ పల్లె దవాఖానలను అందుబాటులోకి తెచ్చారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనుమంటే చేతకాదు.. కానీ వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటదట. ఎమ్మెల్యేలను కొంటం మీ ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ వాళ్లు కుట్రలు చేస్తున్నారు.