గిర్మాజీపేట, మార్చి 9 : వరంగ ల్ జిల్లాకు సంబంధించి ఇంటర్ స్పా ట్ వాల్యూయేషన్ కేంద్రాన్ని గతేడాది నుంచి ఎల్బీ కళాశాలలో నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన పనుల నిమిత్తం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (డీఐఈవో) నాంపల్లిలో ని ఇంటర్ బోర్డుకు అద్దె కారులో వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో గత నెల 23న హనుమకొం డ నక్కలగుట్ట సర్క్యూట్ గెస్ట్‌హౌస్ దగ్గర ఉన్న శ్రీఅశోక ట్రావెల్స్ నుంచి టీఎస్ 28బీ 8522 నంబర్ గల కారులో ఇంటర్ బోర్డుకు పోయి వచ్చినందుకు రూ. 11,900 ఖర్చయినట్లు రసీదును ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ క్యాంప్ ఆఫీసరైన డీఐఈవో పొందారు.
ఇందు లో రాను పోను 380 కిలోమీటర్లకు కారు రెంట్‌కు రూ. 5 వేలు, డీజిల్‌కు రూ. 5,600, రూ. 900 బత్త, టోల్గేట్ ఫీజుకు రూ. 400 చెల్లించినట్లుగా ఉంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉం ది.. అతను బిల్లు పొందిన టీఎస్ 28బి 8522 నంబర్‌తో కారు కాకుండా స్కూటీ ఉంది. జిల్లా స్థాయి అధికారే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాడన్న విష యం సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మా రింది. గతేడాది నిర్వహించిన స్పాట్ వాల్యూయేషన్ సందర్భంలో కూడా పలు ఫేక్ బిల్లులు సృష్టించి డబ్బులు కాజేశారనే ఆరోపణలున్నాయని.. దీనిపై పలువురు ఇంటర్ బోర్డు సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
దీంతో ఫిబ్రవరిలో హనుమకొండ ప్రభు త్వ కళాశాలలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాల డీఐఈవోల సమావేశంలో సదరు జిల్లా అధికారిని బోర్డు సెక్రటరీ ఎస్ కృష్ణ ఆదిత్య మందలించినట్లు తెలిసింది. అన్ని పనులు ఆ అధికారి కనుసన్నుల్లోనే జరగాలని, అడ్డు చెప్పినవాళ్లపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకు పరిపాటని ఉద్యోగులు చర్చించుకుంటున్నా రు. అతడిపై పలుమా ర్లు జిల్లా ఉన్నతాధికారులకు ఫి ర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ఇంటర్ బోర్డు సెక్రటరీ సదరు అధికారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.