భూత్పూర్, డిసెంబర్ 12 : బీఆర్ఎస్తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో ఆల శ్రీకాంత్‌రెడ్డి రూ.లక్షతో సమకూర్చిన ఫర్నీచర్, బీరువాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన జన్మదినం రోజున ఇచ్చిన పిలుపు మేరకు పాఠశాలకు సామగ్రి సమకూర్చడం సంతోషంగా ఉందన్నారు. శ్రీకాంత్‌రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు.
పాఠశాలలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం మండలంలోని తాటిపర్తికి చెందిన విద్యార్థి శిల్ప జాతీయ వాలీబాల్ జట్టుకు ఎంపిక కావడంతో అభినందించారు. కేరళలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు శిల్పకు రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. కొత్తమొల్గరలో గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించిన 14 షాపింగ్ కాంప్లెక్స్‌లను, భట్టుపల్లి జీపీ పరిధిలోని ఏవీఆర్ కాలనీలో రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.అనంతరం 53 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, 47 మందికి రూ.30 లక్షల విలువ గల సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా ఆదానీ-అంబానీలకు రూ.12 లక్షల కోట్లను మాఫీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, రైతుబంధు మండలాధ్యక్షుడు నర్సింహగౌడ్, మత్స్య సహకార సంఘం ఇన్చార్జి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ నరేశ్‌గౌడ్, కో ఆప్షన్ ఖాజా, సర్పంచులు నీలిమ, వెంకటమ్మ, ఆంజనేయులు, వెంకటయ్య, పద్మమ్మ, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్‌గౌడ్, సాయిలు, నాయకులు నారాయణగౌడ్, సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, రాజారెడ్డి, వెంకటశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సాబేర్ తదితరులు పాల్గొన్నారు.