పబ్లిక్‌గా డ్యాన్స్ చేసిన ఓ జంటకు ఇరాన్ కోర్టు ఒకటి 10 ఏండ్ల 6 నెలల జైలు శిక్ష విధించింది. వీరి డ్యాన్స్ నిరసనకారులకు మద్దతుగా ఉండటమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.
దక్షిణాఫ్రికాలో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న ఓ ఇంట్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. దక్షిణాఫ్రికాలో కాల్పుల ఘటనలు సర్వసాధారణంగా మారాయి.
ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ మద్దతుదారుల ఆగడాలు నానాటికి పెరిగి పోతున్నాయి. భారత జాతీయ జెండా పట్టుకున్న ఓ వ్యక్తిని అక్కడి ఖలిస్తాన్ మద్దతుదారులు చితకబాదారు.
తప్పుడు పన్నుల ఆరోపణల నేపథ్యంలో బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్‌ను ప్రభుత్వం నుంచి ప్రధాని రిషి సునక్ తొలగించారు. ఆయనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారు.
ఆర్ధిక సంక్షోభంతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతున్న క్రమంలో ఆర్ధిక మంత్రి ఇషాక్ దర్ వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్ అభివృద్ధి, శ్రేయస్సుకు అల్లాదే బాధ్యతని �
డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నిక బరిలో నిలుస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. అయితే, ప్రచారాన్ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా చేపట్టారు.
నేపాల్ సుప్రీంకోర్టు ఆ దేశ ఉప ప్రధానిని తొలగించింది. ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండటంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆయన ఎంపీగా ఎన్నిక చెల్లదని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది.
డొనాల్డ్ ట్రంప్ మాజీ భార్య ఇవానా ట్రంప్ వీలునామా వెలుగులోకి వచ్చింది. తన ముగ్గురు పిల్లలతోపాటు పెంపుడు కుక్క, సహాయకురాలికి కూడా ఆస్తిలో వాటా ఇచ్చింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో భయంకర చలిగాలులు వీస్తున్నాయి. ఇక్కడి వాతావరణం కారణంగా 15 రోజుల వ్యవధిలోనే 157 మంది చనిపోయారు. ఈ మరణాలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నది.
బాలాకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది నిజమే అని అమెరికా విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి మైక్ పాంపియో పేర్కొన్నారు. ఈ విషయాలను తన తాజా పుస్తకం ‘నెవర్ గివ్ యాన్ ఇంచ్’ లో వివరంగా రాశారు.
షాంఘై సమ్మిట్‌కు రావాల్సిందిగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, చీఫ్ జస్టిస్‌కు భారత్ ఆహ్వానం పంపింది. అయితే, వీరు హాజరయ్యేది మాత్రం అనుమానంగానే ఉన్నది. తమ ప్రతినిధులను పంపాలని నిర్ణయించినట్లు సమాచారం.