Valentine’s day Record | నీటి అడుగున ఓ జంట లాంగెస్ట్ కిస్.. వాలంటైన్స్ డే నాడు గిన్నిస్ రికార్డ్
వాలంటైన్స్ డే ను ఒక్కొక్కరు ఒక్కోరకంగా జరుపుకున్నారు. అయితే, అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలని తపించిన ఓ జంట.. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను తమ పేరిట లిఖించుకున్నారు.
Valentine’s day Record | వాలంటైన్స్ డే ను ప్రేమికులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక దినం నాడు తమ ప్రియమైన వారికి బహుమతులు ఇస్తూ వారి హృదయాలను దోచుకుంటున్నారు. ఎందరు ఎన్నిరకాలుగా భయపెట్టినా.. దాడులు చేస్తామన్నా వెరవకుండా ప్రేమికులు తమకు తోచిన రీతిన ఆనందంగా గడిపి తమ జీవితానికి మధుర స్మృతులను జతచేసుకున్నారు. మధురమైన కౌగిలింతలు, ముద్దులు పంచుకోవడం ప్రేమికులకు క్లాసిక్ వ్యక్తీకరణ కావొచ్చు. అయితే, తాము ప్రత్యేకంగా ఉండాలని తపించిన ఓ జంట.. కొత్త కార్యక్రమానికి నడుం బిగించి ఏకంగా గిన్నిస్ రికార్డునే తమ పేరిట లిఖించుకున్నారు.
దక్షిణాఫ్రికాకు చెందిన బెత్ నీల్, కెనడాకు చెందిన మైల్స్ క్లౌటియర్ ప్రేమలో ఉన్నారు. వీరు తమ ప్రత్యేకతను చాటుకోవాలనుకున్నారు. ఇందుకు ప్రేమికుల రోజును ఎంచుకున్నారు. మాల్దీవుల్లోని ఇన్ఫినిటీ పూల్‌లోకి దిగిన ఈ జంట.. 4 నిమిషాల 6 సెకండ్ల పాటు ముద్దుపెట్టుకున్నారు. వీరి సాహసకార్యాన్ని తిలకించేందుకు అక్కడికి వచ్చిన వారు రికార్డు సాధించినట్లు ప్రకటించగానే హర్షధ్వానాలతో వారిని అభినందించారు. వీరి ముద్దు గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్‌లోకి చేర్చినట్లు తెలిపే పత్రాన్ని గిన్నిస్ రికార్డ్స్ ప్రతినిధులు వారికి అందజేశారు. అంతేకాకుండా గతంలో ఓ జంట నెలకొల్పిన రికార్డును ఈ జంట బద్దలు కొట్టింది. 13 ఏండ్ల క్రితం మిచెల్ ఎలీసా జంట నెలకొల్పిన 3 నిమిషాల 24 సెకండ్ల అండర్ వాటర్ కిస్ రికార్డును అధిగమించారు.
ఇందుకోసం గత మూడు రోజులుగా మాల్దీవుల్లోని ఇన్ఫినిటీ పూల్‌లో విరామం లేకుండా ప్రాక్టీస్ కూడా చేశామని మైల్స్ క్లౌటియర్ చెప్పాడు. చాలా కఠినమైన సాధన చేయడం ద్వారా 13 ఏండ్లనాటి రికార్డును బద్దలుకొట్టగలిగామని ఆయన తెలిపాడు. గిన్నిస్ రికార్డు సాధించడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నదని బెత్ నీల్ చెప్తున్నది. త్వరలో పెండ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నామని, దానికన్నా ముందే ఇలా ప్రపంచ రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉన్నదని ఆమె చెప్పింది. డ్రైవర్లుగా పనిచేస్తున్న ఈ జంటకు ఏడాదిన్నర వయసున్న కుమార్తె నీవ్ ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

