అల్ ఖైదా చీఫ్‌గా సైఫ్ అల్ అదెల్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తన నివేదికలో వెల్లడించింది. అయితే, ఈయన నియామకంపై తాలిబాన్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
జర్మనీలో లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ కంప్యూటర్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో డజన్ల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. సమ్మెకు దిగుతామని బెదిరించిన సందర్భంలో ఈ విషయం తెరపైకి వచ్చిందని పలువురు అం�
వాలంటైన్స్ డే ను ఒక్కొక్కరు ఒక్కోరకంగా జరుపుకున్నారు. అయితే, అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలని తపించిన ఓ జంట.. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను తమ పేరిట లిఖించుకున్నారు.
ఇజ్రాయెల్‌లో న్యాయ సంస్కరణలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీనికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. తక్షణమే చట్టాన్ని విరమించుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తుర్కియేలో సేవలందిస్తున్న హవల్దార్ రాహుల్ చౌదరీ తండ్రయ్యాడు. ఆయనతో పాటు మరో జవాన్ కమలేష్ కుమార్ చౌహాన్ కూడా ఓ బిడ్డకు తండ్రయ్యాడు. తోటి జవాన్లు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు చెప్పారు.
ఉక్రెయిన్ భారీ ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నది. ఆర్థిక లోటును భర్తీ చేసుకునేందుకు ఐఎంఎఫ్ నుంచి రుణం తీసుకునే యోచన చేస్తున్నారు. ఇదివరకే అమెరికా, యురోపియన్ యూనియన్ రుణాలను ప్రకటించాయి.
న్యూజిలాండ్‌ను గాబ్రియెల్ తుఫాన్ వణికిస్తున్నది. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానాలు రద్దయ్యాయి. ప్రధాని తుఫాన్ ప్యాకేజీ ప్రకటించారు.
ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడని నెడుమారన్ బాంబు పేల్చాడు. ఆయన త్వరలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి తిరిగి ఈలం యుద్ధం చేస్తారని చెప్పాడు.
తుర్కియేకు మానవతా సాయం అందించే ఐఏఎఫ్ ఏడో కార్గో విమానం ఆదివారం అదానా చేరుకున్నది. ఆపరేషన్ దోస్త్‌లో భాగంగా తుర్కియేకు 13 టన్నుల వెంటిలేటర్లు, మందులు, బ్లాంకెట్లు తీసుకొచ్చారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య కాన్పు చేసుకునేందుకు రష్యా గర్భిణులు అర్జెంటీనా వెళ్తున్నారు. మంచి వైద్యంతో పాటు మంచి భవిష్యత్ ఇవ్వడం కోసమే ఇలా వెళ్తున్నామని వారు చెప్తున్నారు.
వలసదారులకు వ్యతిరేకంగా నార్త్ వెస్ట్ ఇంగ్లండ్‌లో ఆందోళనలు జరిగాయి. ఈ సంఘటనలో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, వలసదారులను అందరినీ నిందించడం సరికాదని నోస్లీ ఎంపీ జార్జ్ హోవర్త్ చెప్పారు.