Gangster Guilty | 33 హత్యలు చేసిన గ్యాంగ్‌స్టర్.. 1310 సంవత్సరాల జైలుశిక్ష
Gangster Guilty | అతను మొత్తం 33 హత్యలు చేశాడు. తొమ్మది హత్యలకు కుట్రపన్నాడు. అనేక ఇతర ప్రమాదకర నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అందుకే ఈ ప్రమాదకర గ్యాంగ్‌స్టర్‌కు అక్కడి న్యాయస్థానం ఏకంగా 1310 సంవత్సరాల జైలుశిక్ష విధించింది.
ఎల్ సాల్వెడార్: ఉత్తర అమెరికా దేశమైనా ఎల్ సాల్వెడార్లో పోలీసులు ఓ భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతను మొత్తం 33 హత్యలు చేశాడు. తొమ్మది హత్యలకు కుట్రపన్నాడు. అనేక ఇతర ప్రమాదకర నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అందుకే ఈ ప్రమాదకర గ్యాంగ్‌స్టర్‌కు అక్కడి న్యాయస్థానం ఏకంగా 1310 సంవత్సరాల జైలుశిక్ష విధించింది.
విల్మేర్ సెగోవియా అనే ఆ కరుడుగట్టిన నేరగాడు మారా సాల్వట్రుచ గ్యాంగ్‌కు చెందిన షల్టన్ సెల్ సభ్యుడు. ఈ గ్యాంగ్ ఎల్ సాల్వెడార్లో ఎన్నో క్రూరమైన నేరాలకు పాల్పడింది. ఈ గ్యాంగ్‌నే MS-13 అని కూడా అంటారు. అయితే, ఒక నేరస్తుడికి ఏకంగా 13 శతాబ్దాలకుపైగా శిక్ష విధించడం అనేది ఇక్కడ అశ్చర్యకరమైన విషయం.
అయితే, ఇదే ఎల్ సాల్వెడార్ దేశంలో ఇటీవల మరో నరహంతకుడికి కూడా అత్యంత దీర్ఘకాల శిక్ష పడింది. మిగ్వెల్ ఏంజిల్ పోర్టిల్లో అనే గ్యాంగ్‌స్టర్ మొత్తం 22 క్రూరమైన హత్యా నేరాలు చేశాడు. అంతేగాక పలు హత్యాయత్నాలు, దాడులు, బలవంతపు వసూళ్లలో అతని పాత్ర ఉంది. దాంతో మిగ్వెల్‌కు అక్కడి న్యాయస్థానం ఏకంగా 945 సంవత్సరాల జైలుశిక్ష విధించింది.
కాగా, ఈ కరుడుగట్టిన మారా సాల్వట్రుచ గ్యాంగ్‌లో ఏకంగా 60 వేల మంది వరకు సభ్యులు ఉన్నారని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు వాళ్లందరినీ జైల్లో పెట్టేందుకు ఒక పక్కా ప్రణాళికను రచిస్తోంది. ఇప్పటికే కొన్ని వేల మంది గ్యాంగ్ సభ్యులు ఎల్ సాల్వెడార్ జైళ్లలో ఉన్నారు. తాజాగా నిర్మించిన కొత్త జైలులోకి మారా సాల్వట్రుచ గ్యాంగ్‌కు చెందిన 2000 మందిని తరలించారు. ఆ తరలింపునకు సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
Hoy en la madrugada, en un solo operativo, trasladamos a los primeros 2,000 pandilleros al Centro de Confinamiento del Terrorismo (CECOT).
Esta será su nueva casa, donde vivirán por décadas, mezclados, sin poder hacerle más daño a la población.
Seguimos…#GuerraContraPandillas pic.twitter.com/9VvsUBvoHC
— Nayib Bukele (@nayibbukele) February 24, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

