Donald Trump | పోర్న్‌స్టార్‌కు చెల్లింపుల కేసులో డొనాల్డ్ ట్రంప్ అరెస్టు
Donald Trump | అమెరికా రాజకీయ చరిత్రలో సంచలనం. పోర్న్‌స్టార్‌కు చెల్లింపుల కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. మంగళవారం న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టుకు హాజరైన ట్రంప్ ముందుగా డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో లొంగిపోయారు.
Donald Trump | న్యూయార్క్, ఏప్రిల్ 4: అమెరికా రాజకీయ చరిత్రలో సంచలనం. పోర్న్‌స్టార్‌కు చెల్లింపుల కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. మంగళవారం న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టుకు హాజరైన ట్రంప్ ముందుగా డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో లొంగిపోయారు. కోర్టు సిబ్బంది ఆయన వేలిముద్రలు, ఫొటోలు తీసుకున్నారు. దీంతో ట్రంప్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నట్టు కోర్టు పరిగణించింది. ఆ తర్వాత ట్రంప్ విచారణ ప్రారంభమైంది. కాగా, కోర్టు ట్రంప్‌కు బెయిల్ మంజూరు చేస్తే విచారణ అనంతరం ఆయన వెంటనే విడుదల కానున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో.. స్ట్రామీ డానియల్స్ అనే పోర్న్‌స్టార్‌తో తనకున్న శారీరక సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెకు డబ్బు ఇచ్చి అనైతిక ఒప్పందం చేసుకున్నారని ట్రంప్ నేరాభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
కక్షపూరిత చర్య: ట్రంప్
తన కేసుపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది కక్షసాధింపు చర్య అని ఆరోపించారు. తనను అరెస్టు చేయబోతున్నారని, అమెరికాలో ఇలాంటిది జరుగుతుందని నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. 235 ఏండ్ల అమెరికా చరిత్రలో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే.
అసలు ట్రంప్ మీద కేసు ఏంటి ?
ట్రంప్‌తో తనకు శారీరక బంధం ఉందని, 2006లో ఓ హోటల్లో తామిద్దరం ఏకాంతంగా కలిశామని పోర్న్‌స్టార్ స్టార్మీ ఆరోపిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని బయటపెట్టకుండా తనతో ట్రంప్ ఒప్పందం చేసుకొని డబ్బును చెల్లించారన్నారు. ఈ చెల్లింపులను వ్యాపార ఖర్చుగా చూపించారు. ఇలా బిజినెస్ రికార్డులను తప్పుగా చూపించడమే ఇప్పుడు ట్రంప్‌పై అభియోగం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

