Earthquake | ఈక్వెడాన్, పెరూలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 12 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిందని భూకంప కేంద్రాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్ ) గుర్తించింది. పెరూ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈక్వెడార్ మున్సిపాలిటీ బాలావోలో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. 66 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని.. దీనివల్ల పెను ప్రమాదం తప్పిందని అభిప్రాయపడింది.
భూకంప ధాటికి ఈక్వెడార్‌లోని మచలా, క్యున్కా నగరాల్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. శిథిలాల కింద ఇప్పటివరకు 12 మంది మృతదేహాలను గుర్తించినట్లు ఈక్వెడార్ ప్రెసిడెన్సీ వెల్లడించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.