తుర్కియేలో సేవలందిస్తున్న హవల్దార్ రాహుల్ చౌదరీ తండ్రయ్యాడు. ఆయనతో పాటు మరో జవాన్ కమలేష్ కుమార్ చౌహాన్ కూడా ఓ బిడ్డకు తండ్రయ్యాడు. తోటి జవాన్లు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు చెప్పారు.
ఉక్రెయిన్ భారీ ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నది. ఆర్థిక లోటును భర్తీ చేసుకునేందుకు ఐఎంఎఫ్ నుంచి రుణం తీసుకునే యోచన చేస్తున్నారు. ఇదివరకే అమెరికా, యురోపియన్ యూనియన్ రుణాలను ప్రకటించాయి.
న్యూజిలాండ్‌ను గాబ్రియెల్ తుఫాన్ వణికిస్తున్నది. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానాలు రద్దయ్యాయి. ప్రధాని తుఫాన్ ప్యాకేజీ ప్రకటించారు.
ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడని నెడుమారన్ బాంబు పేల్చాడు. ఆయన త్వరలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి తిరిగి ఈలం యుద్ధం చేస్తారని చెప్పాడు.
తుర్కియేకు మానవతా సాయం అందించే ఐఏఎఫ్ ఏడో కార్గో విమానం ఆదివారం అదానా చేరుకున్నది. ఆపరేషన్ దోస్త్‌లో భాగంగా తుర్కియేకు 13 టన్నుల వెంటిలేటర్లు, మందులు, బ్లాంకెట్లు తీసుకొచ్చారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య కాన్పు చేసుకునేందుకు రష్యా గర్భిణులు అర్జెంటీనా వెళ్తున్నారు. మంచి వైద్యంతో పాటు మంచి భవిష్యత్ ఇవ్వడం కోసమే ఇలా వెళ్తున్నామని వారు చెప్తున్నారు.
వలసదారులకు వ్యతిరేకంగా నార్త్ వెస్ట్ ఇంగ్లండ్‌లో ఆందోళనలు జరిగాయి. ఈ సంఘటనలో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, వలసదారులను అందరినీ నిందించడం సరికాదని నోస్లీ ఎంపీ జార్జ్ హోవర్త్ చెప్పారు.
బ్రిటన్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలింది. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ బాంబును మంగళవారం కనుగొని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా పేలిపోయింది.
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తర్వాత మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఇంట్లో రహస్య డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. ఈ నెపాన్ని న్యాయ శాఖపైకి నెట్టేందుకు పెన్స్ చూస్తుండటం విశేషం.
అల్‌ఖైదా ఉగ్రవాదిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరాలన్న ఆయన పన్నాగాన్ని ఎన్ఐఏ భగ్నం చేసింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన ఆయన ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని విచారిస్తన్నారు.
కెనడాలో పటాసుల అమ్మకాలపై నిషేధం విధిస్తున్నారు. కొన్ని నగరాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు. అక్కడి భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాణాసంచా హిందువుల సంస్కృతికి సంబంధించిన అంశమని వారంటున్నారు.
యూరప్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుడిగాలిలా పర్యటిస్తున్నారు. నిన్న బ్రిటన్‌కు వెళ్లిన ఆయన.. అర్ధరాత్రి ఫ్రాన్స్‌కు చేరుకుని అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు, జర్మనీ ఛాన్సలర్‌తో భేటీ అయ్యారు.