Zelensky Tour | జెలెన్స్కీ సుడిగాలి పర్యటన.. ఫ్రెంచ్ అధ్యక్షుడు, జర్మన్ ఛాన్సలర్‌తో భేటీ
యూరప్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుడిగాలిలా పర్యటిస్తున్నారు. నిన్న బ్రిటన్‌కు వెళ్లిన ఆయన.. అర్ధరాత్రి ఫ్రాన్స్‌కు చేరుకుని అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు, జర్మనీ ఛాన్సలర్‌తో భేటీ అయ్యారు.
Zelensky Tour | రష్యా యుద్ధాన్ని మరింత సమర్ధంగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ యూరప్‌లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బుధవారం బ్రిటన్‌లో ఆకస్మికంగా పర్యటనకు వచ్చిన ఆయన అక్కడ రిషి సునక్, బ్రిటీష్ రాజు చార్లెస్‌తో భేటీ అయ్యారు. అనంతరం బ్రిటన్ పార్లమెంట్లో ప్రసంగించారు. అక్కడి నుంచి అర్ధరాత్రి సమయంలో ఆయన ఫ్రాన్స్ చేరుకున్నారు. అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలోఫ్ స్కోల్జ్‌లను కలిశారు. రష్యాకు గట్టి సవాల్ విసిరేందుకు వీలైనంత త్వరగా ఫైటర్ జెట్లను, భారీ ఆయుధాలను పంపాలని ఫ్రాన్స్, జర్మనీలను జెలెన్స్కీ కోరారు.
ఉక్రెయిన్ విజయం సాధించడంతోపాటు శాంతి కోసం, యూరప్ కోసం, ప్రజలు తమ హక్కులను పొందేందుకు తమ దేశం అండగా ఉంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు సహాయం అందించడానికి తాము తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని చెప్పారు. ఉక్రెయిన్‌లో మొత్తం యూరప్ భవిష్యత్ ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. రష్యా గెలవదు, గెలవకూడదని మాక్రాన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, జర్మన్ ఛాన్సలర్ స్కోల్జ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్, యూరోపియన్ కుటుంబంలో ఒక భాగమని పేర్కొన్నారు. జర్మనీ ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలు, మానవతా సహాయం అందించిందని, ఉక్రెయిన్‌కు అవసరమైనంత వరకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఉక్రెయిన్‌కు లియోపార్డ్ ట్యాంకులను ఇవ్వనున్నట్లు జర్మనీ ప్రకటించింది. మొదటి ట్యాంక్ బెటాలియన్ ఏప్రిల్ నాటికి ఉక్రెయిన్ నగరం కైవ్‌కు చేరుకుంటుందని జర్మనీ రక్షణ మంత్రి తెలిపారు. అమెరికా, బ్రిటన్ కూడా ఉక్రెయిన్‌కు పలు ట్యాంకులు, ఆయుధాలను పంపుతామని హామీ ఇచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన అనంతరం జెలెన్స్కీ తొలిసారి యూరప్‌లో పర్యటిస్తున్నాడు. బుధవారం బ్రిటిష్ పార్లమెంట్లో ప్రసంగించిన జెలెన్స్కీ.. బ్రిటన్ ప్రజలకు ఉక్రెయిన్ ‘వార్ హీరోస్’ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

