Shocking | ఓ జంట చేష్ఠతో ఎయిర్‌పోర్టు అధికారులు షాకయ్యారు. ఇలాంటి దృశ్యాన్ని లైఫ్‌లో చూడలేదురో అంటూ నోరెళ్లబెట్టారు. డబ్బు లేకపోతే ప్రయాణం మానుకోవాలి కానీ, ఇలాంటి పిచ్చి చేష్టలేంటి అని వారిని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ టెల్ అవీవ్ ఎయిర్‌పోర్టులో ఏం జరిగిందంటే..
ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ప్రకారం, టెల్ అవీవ్‌లోని బెన్-గురియన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఓ జంట బ్రెజిల్ వెళ్లేందుకు చెక్ ఇన్ పూర్తిచేసుకున్నారు. అయితే, తమ చిన్నారికి కూడా టికెట్ తీసుకోవాలని అక్కడి సిబ్బంది వారికి సూచించారు. దాంతో అదనపు టికెట్ కొనేందుకు వారు నిరాకరించారు. టికెట్ లేనిదే బోర్డింగ్‌కు అనుమతించమని సిబ్బంది కరాఖండితంగా చెప్పడంతో.. ర్యాన్ఎయిర్ విమానం టేకాఫ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు చెక్-ఇన్ కౌంటర్ వద్ద తమ బిడ్డను వదిలిపెట్టి షాక్‌కు గురిచేశారు.
బెల్జియన్ పాస్‌పోర్టులను కలిగి ఉన్న ఈ జంట.. బిడ్డతో కలిసి బ్రస్సెల్స్కు వెళ్లేందుకు టెల్ అవీవ్ ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు తెలుస్తున్నది. టెర్మినల్ కౌంటర్ 1 వద్దకు రాగానే వారి బిడ్డకు కూడా టికెట్ కొనుగోలు చెప్పడంతో ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని ర్యాన్ ఎయిర్ కౌంటర్ మేనేజర్ చెప్పారు. ఇలాంటి ఘటనను తామెన్నడూ చూడలేదని అక్కడి సిబ్బంది అంటున్నారు. చెక్-ఇన్ కౌంటర్ వద్ద బిడ్డను వదిలి వెళ్లిపోయేందుకు యత్నించిన జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.