టిబెటన్ చిన్నారులను బలవంతంగా తీసుకెళ్లి చైనా బోర్డింగ్ స్కూళ్లలో చేర్పిస్తున్నది. దీంతో వారు మాతృభాష మరిచిపోతారు. అలా తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తున్నారని యూఎన్ ఒక నివేదికలో వెల్లడించింది.
జెలెన్స్కీ బ్రిటన్‌లో ఆకస్మిక పర్యటనకు వచ్చారు. కింగ్ చార్లెస్‌తో సమావేశం కానున్నట్లు సమాచారం. యూకే పార్లమెంట్లో ప్రసంగం ఉంటుందని తెలుస్తున్నది. ఇక్కడి నుంచి ఆయన బ్రెజిల్ వెళ్తారు.
తన గుండె పగిలిపోయేలా చేసిన ప్రియురాలిపై ఓ వ్యక్తి కోర్టులో దావా వేశాడు. రూ.25 కోట్ల ఫైన్ చెల్లించేలా ఆదేశించాలంటూ తన పిటిషన్లో కోరాడు. ఈ పిటిషన్‌ను సింగపూర్ హైకోర్టు ఈ నెల 9 న విచారించనున్నది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండుంటే ఈ వివాదాన్ని 24 గంటల్లో తేల్చేసేవాడినన్నారు.
పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం తీవ్రరూపం దాల్చింది. గత 47 ఏండ్ల క్రితం కంటే ఎక్కువగా 27.6 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది. ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గితేనే రుణం మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి.
బ్రిటన్‌లో కనీవినీ ఎరగని రీతిలో ఉపాధ్యాయులు, సివిల్ సర్వెంట్లు సమ్మెకు దిగారు. దశాబ్దంలో అతిపెద్ద ప్రదర్శనను లండన్‌లో చేపట్టారు. జీతాలు పెంచాలన్నది వారి ప్రధాన డిమాండ్.
పబ్లిక్‌గా డ్యాన్స్ చేసిన ఓ జంటకు ఇరాన్ కోర్టు ఒకటి 10 ఏండ్ల 6 నెలల జైలు శిక్ష విధించింది. వీరి డ్యాన్స్ నిరసనకారులకు మద్దతుగా ఉండటమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.
దక్షిణాఫ్రికాలో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న ఓ ఇంట్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. దక్షిణాఫ్రికాలో కాల్పుల ఘటనలు సర్వసాధారణంగా మారాయి.
ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ మద్దతుదారుల ఆగడాలు నానాటికి పెరిగి పోతున్నాయి. భారత జాతీయ జెండా పట్టుకున్న ఓ వ్యక్తిని అక్కడి ఖలిస్తాన్ మద్దతుదారులు చితకబాదారు.
తప్పుడు పన్నుల ఆరోపణల నేపథ్యంలో బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్‌ను ప్రభుత్వం నుంచి ప్రధాని రిషి సునక్ తొలగించారు. ఆయనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారు.