Mike Pompeo | బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే: తన పుస్తకంలో మైక్ పాంపియో
బాలాకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది నిజమే అని అమెరికా విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి మైక్ పాంపియో పేర్కొన్నారు. ఈ విషయాలను తన తాజా పుస్తకం ‘నెవర్ గివ్ యాన్ ఇంచ్’ లో వివరంగా రాశారు.
Mike Pompeo | పాకిస్తాన్ సరిహద్దులోని బాలాకోట్‌పై సర్జికల్ స్ట్రైక్స్ జరిగింది నిజమే అని అమెరికా విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి మైక్ పాంపియో తెలిపారు. అప్పుడు భారత్-పాకిస్తాన్ మధ్య సంఘర్షన అణు దాడికి ఎంత దగ్గరగా వచ్చిందో ప్రపంచానికి తెలియదన్నారు. ఈ విషయాలను ఆయన తన తాజా పుస్తకంలో వెల్లడించారు. భారత్‌లో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ విషయాలను తనతో పంచుకున్నారని కూడా ఆయన స్పష్టం చేశారు. కాగా, మైక్ పాంపియో చేసిన వాదనలపై అమెరికా హోం శాఖ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు.
అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో ‘నెవర్ గివ్ యాన్ ఇంచ్’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించి 2019 ఫిబ్రవరి 27, 28 తేదీల్లో అమెరికా-నార్త్ కొరియా శిఖరాగ్ర సమావేశంలో సుష్మాస్వరాజ్ తనతో చెప్పిన విషయాలను ఈ పుస్తకంలో వివరంగా రాశారు. బాలాకోట్‌పై తాము సర్జికల్ స్ట్రైక్స్ చేయడంతో వారు తమ ఆణ్వాయుధాలను బయటకు తీసి దాడి చేసేందుకు సిద్ధమయ్యారని కూడా సుష్మా చెప్పారని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధాలను ఎదుర్కొనేందుకు భారత్ కూడా సన్నాహాలు చేసినట్లు ఆయన తెలిపారు.
2019 ఫిబ్రవరిలో ఇండియా-పాకిస్తాన్ మధ్య ఘర్షణ వాతావరణం అణు దాడికి ఎంత దగ్గరగా వచ్చిందో ప్రపంచానికి కూడా తెలియదని తాను అనుకుంటున్నానన్నారు. ఎందుకిలా అనే ప్రశ్నకు సరైన సమాధానం కూడా తనకు తెలియదని, అయితే రెండు దేశాలు మాత్రం అణు దాడికి చాలా దగ్గరగా వచ్చాయన్న విషయం తనకు తెలుసునని తన పుస్తకంలో వెల్లడించారు. ఒకవైపు ఉత్తర కొరియా అణ్యాయుధాలపై, మరోవైపు ఇండియా-పాక్ మధ్య కశ్మీర్ విషయంపై అణు ఆయుధాల దాడిపై జరిగిన చర్చలను తన జీవితంలో మరిచిపోని రోజని పేర్కొన్నారు. సుష్మా స్వరాజ్ చెప్పిన విషయాల మేరకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాకు ఫోన్ చేయగా.. అణ్వాయుధ దాడికి సిద్ధమవుతున్న వార్తలు అవాస్తవమని చెప్పారని మైక్ పాంపియో తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

