Dolphine Typhoon : డాల్ఫిన్ తుపాను (Dolphine Typhoon) చైనా (China) ను గడగడలాడిస్తోంది. ఈ తుపాను ఆదివారం మధ్యాహ్నం చైనా తూర్పు తీరం (China East Coast) లోని జెజియాంగ్ ప్రావిన్స్ (Jejiang Province) ను తాకింది. ఈ సంవత్సరం చైనాలో సంభవించిన తుపానుల్లో ఇది 13 వది. దాంతో చైనా జాతీయ వాతావరణ సంస్థ అత్యున్నత స్థాయి రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. ఈ తుపానువల్ల గాలులు ఒక సెకనుకు 42 మీటర్ల వేగంతో వీస్తున్నాయి.
తుపాను కారణంగా షాంఘై (Shaghai) లోని రెండు ప్రముఖ విమానాశ్రయాల్లో దాదాపు 2,230 విమానాలు రద్దయ్యాయి. అందులో 720 విమానాలు సోమవారం రాత్రి వరకు రద్దయ్యాయి. హాంగ్‌జావ్ నగరంలోని విమానాశ్రయంలో రాకపోకలు సాగించాల్సిన దాదాపు 500 విమానాలను అధికారులు రద్దుచేశారు. జెజియాంగ్ ప్రావిన్స్‌ను తుపాను తాకడంతో తీర ప్రాంతాల్లోని లక్షల మంది జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.