Zelensky | ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ బుధవారం ఆకస్మిక పర్యటన నిమిత్తం బ్రిటన్ చేరారు. బ్రిటీష్ ప్రధానమంత్రి రిషి సునక్ ఆయనను కలిసేందుకు విమానాశ్రయానికి వచ్చారు. ఈ విషయాన్ని రిషి సునక్ ట్విట్టర్లో వెల్లడించారు. కొద్దిసేపట్లో ఆయన బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో బ్రిటీష్ రాజు చార్లెస్‌ను కలుసుకోనున్నారు. ఇక్కడి నుంచి ఆయన బ్రెజిల్ వెళ్తారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు అనుకోని అతిథిలా యూకే వచ్చాడు. జెలెన్స్కీ వస్తున్న సమాచారం మేరకు ఆయనకు స్వాగతం చెప్పేందుకు బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. జెలెన్స్కీని సాదరంగా ఆహ్వానించిన రుషి.. ఆ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అక్కడి నుంచి ఇద్దరూ ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ చేరుకున్నారు. కింగ్ చార్లెస్‌ని కలిసేందుకు ఆయన కొద్ది సేపటి క్రితం బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు బయల్దేరి వెళ్లాడు. జెలెన్స్కీ పర్యటన నేపథ్యంలో ఉక్రెయిన్‌కు బ్రిటీష్ సైనిక మద్దతును పెంచుతుందని, వారి పైలట్లకు నాటో ఫైటర్ జెట్లపై శిక్షణ ఇవ్వాడనికి బ్రిటన్ వీలుకల్పిస్తుందని భావిస్తున్నారు. యూకే పార్లమెంట్లో జెలెన్స్కీ ప్రసంగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.
రష్యా దాడులు ప్రారంభించిన తర్వాత దేశం వెలుపల జెలెన్స్కీకి ఇది రెండో పర్యటన. అంతకుముందు డిసెంబర్ నెలలో అమెరికా వెళ్లాడు. అక్కడ ప్రెసిడెంట్ జో బైడెన్‌తో సమావేశమయ్యాడు. అమెరికా పార్లమెంట్లో ప్రసంగించారు. బ్రిటన్ పర్యటన తర్వాత జెలెన్స్కీ బ్రెజిల్ వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ అతను ఈయూ నాయకులతో సమావేశమై రష్యా దాడులను మరింత సమర్ధంగా ఎదుర్కోవడానికి కావాల్సిన సాయం గురించి చర్చించనున్నట్లు తెలుస్తున్నది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపుతున్నట్లు అమెరికా, బ్రెజిల్ ప్రకంటించిన తర్వాత.. బ్రిటన్ కూడా 14 ఛాలెంజర్ 2 ట్యాంకులతో పాటు ఫిరంగులు, వేల రౌండ్ల మందుగుండు సామగ్రి పంపుతున్నట్లు ప్రకటించింది.