Cyclone Gabriel | న్యూజిలాండ్‌ను వణికిస్తున్న గాబ్రియేల్ తుఫాన్.. నిలిచిన విద్యుత్ సరఫరా, 509 విమానాల రద్దు
న్యూజిలాండ్‌ను గాబ్రియెల్ తుఫాన్ వణికిస్తున్నది. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానాలు రద్దయ్యాయి. ప్రధాని తుఫాన్ ప్యాకేజీ ప్రకటించారు.
Cyclone Gabriel | న్యూజిలాండ్‌ను తుఫాన్ చుట్టుముట్టింది. ఫలితంగా పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు రాత్రి వేళ చీకట్లోనే వెల్లదీస్తున్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి వాహనాలు ధ్వంసమయ్యాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పెద్ద సంఖ్యలో విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రూ.60 కోట్ల సహాయక ప్యాకేజీని ప్రధాని క్రిస్ హిప్కిన్స్ ప్రకటించారు.
న్యూజిలాండ్‌ను గాబ్రియెల్ తుఫాను వణికిస్తున్నది. దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో 250 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆక్లాండ్ నగరంలో గాలి వేగం ప్రస్తుతం గంటకు 110 కిలోమీటర్లుగా ఉన్నది. ఉత్తరాది ప్రాంతాల్లో దాదాపు 46 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆక్లాండ్‌లో గత 24 గంటల్లో 4 అంగుళాల వర్షం కురిసింది. ఇక్కడ సముద్ర మట్టం వేగంగా పెరుగుతున్నది. ప్రజలు ముందుజాగ్రత్త చర్యగా ఇళ్లు, గోదాముల బయట వరద నీటిని అడ్డుకునేందుకు ఇసుక బస్తాలు వేసుకున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో దేశంలో 509 విమానాలను రద్దు చేశారు. మట్కానా తీరంలో మాథెసన్స్ బే బీచ్‌లో చాలా ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి.
న్యూజిలాండ్ వాతావరణ విభాగం ప్రకారం, హరికేన్ గాబ్రియేల్ ఇప్పుడే తీరం దాటింది. ఇంతలో విద్యుత్ లైన్లు, రోడ్లు, చెట్లు దెబ్బతిన్నాయి. వచ్చే 24 గంటలు కీలకమని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఈ తుఫాను ప్రమాదకరమని పేర్కొన్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్.. ప్రజల సహాయం కోసం రూ.60,37,83,000 ప్యాకేజీని ప్రకటించారు. తీర రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుఫాన్ మరీ పెరిగిపోయిన పక్షంలో ఎమర్జెన్సీ విధించేందుకు సిద్ధమని న్యూజిలాండ్ ఎమర్జెన్సీ మేనేజిమెంట్ శాఖ మంత్రి కీరన్ మెక్‌అనుల్టీ వెల్లడించారు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

