తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమైంది. రికార్డు స్థాయి వర్షాలతో జలవనరులు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లు జలమయ్యాయి.
మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం, మోకిలలోని విల్లాల్లోకి భారీగా వరద నీరు చేరింది. సుమారు 200 విల్లాలు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టులోకి పెద్దఎత్తున నీర�
భారీవర్షాలతో మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. జిల్లాలో 29.67 సెంటీమీటర్లు సగటు వర్షపాతం నమోదవగా, అత్యధికంగా చిన్నగూడూరులో 45.06 సెంటీమీటర్లు కురిసింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భీకర వర్షం జలప్రళయాన్ని తలపించింది. శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన వరద రాత్రికి రాత్రే ఊళ్లను, కాలనీలను ముంచెత్తింది. జిల్లాలో గరిష్ఠంగా 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శనివారం మొదలైన వాన ఆదివారం కూడా కొనసాగింది. సూర్యాపేట జిల్లాలో కురిసిన అతి భారీ వర్షపాతం అతలాకుతలం చేసింది. కోదాడ, �
భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం 13 మంది మృతి చెందారు. మరో 10 మంది గల్లంతయ్యారు. వందల సంఖ్య లో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు నూనావత్
భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆదేశించారు.
భారీ వానలు, వరదలతో అతలాకుతలమైన ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డి మాండ్ చేశారు.
నల్లగొండ జిల్లాలో వ ర్షం బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం ప్రారంభమైన వాన ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా పడింది. కాపురాల, బ్రహ్మంగారి, లతీఫ్సాబ్ గుట్టల నుంచి వర్షపు నీరు పెద్ద ఎత్తున రావడంతో పట్టణ�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వానలు దంచికొడుతున్నాయి. ఆదివారం రెండో రోజు కూడా ముసురు వదల్లేదు.
Sarlasagar | వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళ సాగర్ గేట్స్(Sarlasagar) తెరుచుకున్నాయి. భారీ వర్షాల(Heavy rain) కారణంగా నీటి ఉధృతి పెరగడంతో ఆటోమేటిక్ సైఫన్ గేట్స్(Siphon gates ) ఓపెన్ అయ్యాయి. ప్రాజెక్టుకు మొత్తం 17 సైఫన్ గేట్స్ ఉంట�