హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : భారీ వానలు, వరదలతో అతలాకుతలమైన ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డి మాండ్ చేశారు. భారీ వ రదల కారణంగా మున్నే రు నది పోటెత్తడంతో ఐదుగురు మృత్యువాత పడడంపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఖమ్మంలో వందలాది ఇండ్లు ముం పునకు గురై, వేలాది మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరాశ్రయులకు షెల్టర్లు ఏర్పాటుచేయాలని, తాగునీరు, ఆహారం అందించాలని, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుతాన్ని కోరారు.