న్యూస్ నెట్వర్క్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం 13 మంది మృతి చెందారు. మరో 10 మంది గల్లంతయ్యారు. వందల సంఖ్య లో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు నూనావత్ మోతీలాల్ (45), నూనావత్ అశ్వని (26) వాగు వరదనీటిలో గల్లంతయ్యారు. అశ్వని ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ వ్యవసాయ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నది. ఆమె సోదరుడికి నిశ్చితార్థానికి వచ్చి ఆదివారం తెల్లవారుజామున తండ్రి మోతీలాల్‌తో కలిసి హెదరాబాద్ విమానాశ్రయానికి కారులో బ యలుదేరింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జీ పైనుంచి పారుతున్న ఆకేరు వాగులోనే కారును పోనిచ్చారు. వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. తమను రక్షించాలని కు టుంబ సభ్యులకు తండ్రి, కూతురు ఫోన్ చేశా రు. కొద్దిసేపటికి వారి ఫోన్ స్విచ్ఆఫ్ వచ్చిం ది.
పోలీసుల సహాయంతో గ్రామస్తులు గా లింపు చేపట్టారు. సమీపంలోని తోటలో అశ్వ ని మృతదేహం లభించింది. తండ్రి మోతీలా ల్ ఆచూకీ కోసం పోలీసులు, రెస్క్యూ బృందాల సభ్యులు గాలిస్తున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం వెంకటాపురంలోని తోగువాగు ఉప్పొంగడంతో తాటి ఆదెమ్మ (70), కల్లూరి నీలమయ్య (60) కొట్టుకుపోగా 200 మేకలు, 30 పశువులు గల్లంతయ్యాయి. వారి మృతదేహాలు వాగు ఒడ్డున చెట్ల వద్ద దొరికాయి. మేకలు, పశువులు మృతిచెంది చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లాలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురంలో నర్సయ్య, హనుమకొండ జిల్లా పరకాల మండలం రాజీపేటలో గువ్వ రాములు (58), పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన చెప్యాల పవన్, కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌కు చెందిన గోస్కుల కుమార్ (45), కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేటకు చెందిన కైరంకొండ శివరాములు (55), సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన సందరి లక్ష్మణ్ (55) గల్లంతయ్యారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో జెర్రిపోతుల మల్లికార్జున్ (38), వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలో వృద్ధురాలు కొండ్రు సమ్మక్క, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఆరీఫ్ మన్సూర్ (14 నెలలు), నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడ్లోతల్లి హన్మమ్మ(60), కూతురు అంజమ్మ (40), సిద్దిపేట జిల్లా కోహెడ మండల రాంచంద్రాపూర్‌లో బొబ్బల కనకారెడ్డి (60) మృతిచెందారు. కాగా.. ఉమ్మడి జిల్లాల పరిధిలో 61 పశువులు, నాలుగు బర్రెలు, 1500 కోళ్లు, 422 గొర్రెలు వరద నీటిలో చిక్కుకొని మృత్యువాత పడగా.. మరో 156 గొర్రెలు వర్షపునీటిలో కొట్టుకుపోయాయి.