అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రచారం కోసం కేంద్రం వేల కోట్లు ఖర్చు చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రూ. 6,509.56 కోట్లు ప్రకటనల కోసం వెచ్చించిం ది.
ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 13 వేల 450 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 2473 మంది రైతుల ఖాతాల్లో రూ.22.26 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నదని, ఆ వ్యవస్థ ద్వారా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల పాలనలో జోక్యం చేసుకుంటున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మండిపడ్�
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నిర్వహణా పగ్గాల్ని ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తికి అప్పగించడానికి రంగం సిద్ధమవుతున్నది.
ఎవరూ ఖాళీ కడుపుతో నిద్రించకూడదన్నది మన సంప్రదాయమని, దేశంలోని చివరి వ్యక్తి వరకూ ఆహార ధాన్యాలను చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రాష్ర్టాలకు నిధుల నిలిపివేత, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతు ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్‌సభ జాతీయ కార్యదర్శి కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
అన్నం పెట్టే రైతుకు ఆసరాగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల ధరల పెంపుతో అన్నదాతల నడ్డి విరిచింది. డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచి రైతులను మరింత కుంగదీసింది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన 15 ఏండ్లు దాటిన వాహనాలను వినియోగం నుంచి ఉపసంహరించుకొని, స్క్రాప్(తుక్కు)కు పంపిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.