బీజింగ్: చైనాలోని గ్వాంగ్ఝౌ, జియాన్ నగరాల్లో మేఘాలుగా ఏర్పడే స్థాయిలో గాలిలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నా యి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు ఈ నగరాల్లో భూమి పైన గల వాతావరణంలో మైక్రోప్లాస్టిక్స్, నానోప్లాస్టిక్స్ను పరిశీలించారు. గాలిలోని దుమ్ము కణాలు, అవి కిందికి పడిపోయే రేటు అంతకుముందు అంచనాల కన్నా రెండు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి, అవాక్కయ్యారు. అంతకు ముందు అంచనాలను దృశ్య ఆధారిత విశ్లేషణ విధానాల్లో లెక్కగట్టారు. గడచిన రెండు దశాబ్దాల్లో కాలు ష్య కారకంగా ప్లాస్టిక్ ప్రపంచ సమస్యగా మారిందని పరిశోధకులు చెప్పా రు.
భూమిపై ప్రతి వాతావరణ పరిస్థితిలోనూ ప్లాస్టిక్స్ విస్తృతంగా పంపిణీ అవగలగటమే దీనికి కారణమని తెలిపారు. గాలి పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, ట్రాఫిక్ కార్యకలాపాల వల్ల మైక్రోప్లాస్టిక్స్, నానోప్లాస్టిక్స్ వాతావరణంలోకి వెళ్తున్నాయి. రోడ్డు ధూళి కూడా వాతావరణంలో కలుస్తున్నది. ప్లాస్టిక్ కణాలు సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి సుదీర్ఘ సమయం వాతావరణంలో తేలియాడుతూ ఉండగలవు. దీనివల్ల కూడా ప్లాస్టిక్ మేఘాలు ఏర్పడతాయి. ఈ నివేదికను ‘సైన్స్ అడ్వాన్సెస్’ జర్నల్లో ప్రచురించారు.